PAPA Teaser Released: ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి ఏం చేశారు? టీజర్ వచ్చేసింది చూడండి
PAPA Teaser Released: నాగశౌర్య హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రముఖ నటుడు శ్రీనివాస్ అవసరాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
PAPA Teaser Released: టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (PAPA). ప్రముఖ నటుడు శ్రీనివాస్ అవసరాల చాలా రోజుల తర్వాత మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా చేసింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.
క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా సాగింది. నాగశౌర్య, మాళవిక నాయర్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్తోన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. కల్యాణి మాలిక్ అందించిన సంగీతమైతే సినిమాను మ్యూజికల్ రైడ్‍కు తీసుకెళ్తోంది. ఫ్రెండ్షిప్, లవ్‌ను సమతూకంగా చూపించే ప్రయత్నం చేసినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.
నాగశౌర్య సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా చేస్తోంది. శ్రీనివాస్ అవసరాల స్వీయ దర్శకత్వంతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు. మేఘా చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, వారణాశి సౌమ్య, హరిణి రావు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల గతంలో ఊహాలు గుస గుసలాడే, జో అచ్యుతానంద లాంటి రొమాంటిక్ సినిమాలకు దర్శకత్వం వహించి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా అదే కోవలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కల్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతానికి సమకూరుస్తున్నారు. మార్చి 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
సంబంధిత కథనం