Thandel Movie: నాగచైతన్య vs సాయిపల్లవి.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ-naga chaitanya vs sai pallavi discussions going on social media about the actors performance in thandel movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thandel Movie: నాగచైతన్య Vs సాయిపల్లవి.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ

Thandel Movie: నాగచైతన్య vs సాయిపల్లవి.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 07, 2025 03:47 PM IST

Thandel Movie: తండేల్ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీలో నాగచైతన్య, సాయిపల్లవి పర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ చర్చ జోరుగా సాగుతోంది.

Thandel Movie: నాగచైతన్య vs సాయిపల్లవి.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ
Thandel Movie: నాగచైతన్య vs సాయిపల్లవి.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. లవ్ స్టోరీ సినిమాలో ఇద్దరి మధ్య మంచి కెమెస్ట్రీ వర్కౌట్ అవగా.. మరోసారి వీరి కాంబో ఈ చిత్రంతో రిపీట్ అయింది. రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందిన తండేల్‍లో చిత్రంలో వీరి జోడీ ఎలా ఉంటుందోనని ముందు నుంచి క్యూరియాసిటీ ఉంది. ఈ మూవీ ఎట్టకేలకు నేడు (ఫిబ్రవరి 7) థియేటర్లలోకి వచ్చింది. అనుకున్నట్టుగానే చైతూ, సాయిపల్లవి జోడీ మరోసారి మ్యాజిక్ చేసింది. అయితే, ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జోరుగా ఓ చర్చ జరుగుతోంది.

చైతూ అని కొందరు.. పల్లవి అని మరికొందరు

సాధారణంగా ఏ సినిమాలో అయినా సాయిపల్లవి ఉంటే ఆమెనే హైలైట్ అవుతారు. హీరో ఎవరైనా సరే ఆమెపైనే ప్రేక్షకుల దృష్టి ఉంటుంది. ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్, సహజమైన అందం, స్వాగ్ ఇందుకు ముఖ్యమైన కారణాలు ఉంటాయి. అమరన్ లాంటి చిత్రంలోనూ సాయిపల్లవికే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. తండేల్ మూవీలో ఆమె అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా అదే రేంజ్‍లో యాక్టింగ్ పర్ఫార్మెన్సుతో మెప్పించేశారు.

తండేల్ చిత్రంలో నాగచైతన్యది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఈ తరుణంలో సాయిపల్లవిని మించి ఈ చిత్రం చైతూ అద్భుతంగా నటించారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పల్లవి కంటే చైతూనే హైలైట్ అయ్యారంటూ అభిప్రాయపడుతున్నారు. అంతలా యాక్టింగ్‍తో ఆకట్టుకున్నారని చెబుతున్నారు.

నాగచైతన్య పర్ఫార్మెన్స్ చాలా బాగున్నా.. సాయిపల్లవిని మించేంత లేదంటూ ఆమె ఫ్యాన్స్ కొందరు పోస్టులు చేస్తున్నారు. ఎమోషన్ సీన్లు, డ్యాన్స్‌లో పల్లవి ప్రత్యేకత చూపించారని, అద్భుతంగా చేశారంటూ అభిప్రాయపడుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో నాగచైతన్య వర్సెస్ సాయిపల్లవి పర్ఫార్మెన్స్ అనేలా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

సాధారణంగా ఒకే సినిమాలో హీరోహీరోయిన్లు పర్ఫార్మెన్స్‌లు పోలుస్తూ చర్చ జరగడం చాలా అరుదు. తండేల్ విషయంలో అది జరుగుతోంది. అయితే, పాజిటివ్ విషయమే కావటంతో ఈ మూవీకి మరింత కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తంగా నాగచైతన్య, సాయిపల్లవి యాక్టింగ్, వారిద్దరి మధ్య కెమెస్ట్రీ తండేల్‍కు పెద్ద ప్లస్‍గా నిలిచాయి.

మత్స్యకారుడిగా చైతూ

తండేల్ మూవీలో శ్రీకాకుళం మత్స్యకారుడి రాజు పాత్రను నాగచైతన్య పోషించారు. ఈ పాత్ర కోసం ఆయన మేకోవర్ మెప్పించింది. హావభావాలు, యాస కూడా బాగా సెట్ అయ్యాయి. ఈ క్యారెక్టర్ కోసం చైతూ కష్టపడిన విషయంపై తెరపై స్పష్టంగా తెలుస్తుంది. దేశభక్తి సన్నివేశాల్లోనూ చైతూ గంభీరమైన నటన మెప్పించింది. పాకిస్థాన్ జైలులో నెలల పాటు హింసలు అనుభవించి భారత్‍కు తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్స్యకారుల నిజజీవిత ఘటనలతో ఈ మూవీని డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించారు.

తండేల్ చిత్రానికి దేశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలతో పాటు బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. షందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీకి కూడా ప్రశంసలు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ మూవీని బన్నీవాసు నిర్మించాయి. అల్లు అరవింద్ సమర్పించారు.

Whats_app_banner

సంబంధిత కథనం