Naga Chaitanya Fans: స్కూల్‌కు ఎందుకు పోలేదు.. పోబుద్ధి కావట్లేదా?: పిల్లలను చూసి కారు ఆపిన నాగ చైతన్య.. వీడియో వైరల్-naga chaitanya stops car for children asks them what they are studying video gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya Fans: స్కూల్‌కు ఎందుకు పోలేదు.. పోబుద్ధి కావట్లేదా?: పిల్లలను చూసి కారు ఆపిన నాగ చైతన్య.. వీడియో వైరల్

Naga Chaitanya Fans: స్కూల్‌కు ఎందుకు పోలేదు.. పోబుద్ధి కావట్లేదా?: పిల్లలను చూసి కారు ఆపిన నాగ చైతన్య.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

Naga Chaitanya Fans: నాగ చైతన్యకు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న అతడు.. కొంతమంది పిల్లలు కనిపించడంతో ఆపి వాళ్లతో మాట్లాడాడు. స్కూలుకు ఎందుకు వెళ్లలేదని వాళ్లను అడిగాడు.

స్కూల్‌కు ఎందుకు పోలేదు.. పోబుద్ధి కావట్లేదా?: పిల్లలను చూసి కారు ఆపిన నాగ చైతన్య.. వీడియో వైరల్

Naga Chaitanya Fans: టాలీవుడ్ హీరో నాగ చైతన్య తన కుర్ర అభిమానులను కలిశాడు. రీసెంట్ గా రిలీజైన నీ తండేల్ సినిమా చూశామంటూ తన కారు దగ్గరికి వచ్చిన పిల్లలతో అతడు సరదాగా మాట్లాడాడు. ఏం చదువుతున్నారు? ఏ స్కూల్లో చదువుతున్నారంటూ ప్రశ్నించాడు. మరి స్కూల్ కు ఎందుకు పోలేదని కూడా వాళ్లను అడిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పిల్లలతో నాగ చైతన్య

నాగ చైతన్య తన కారును సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో కొందరు పిల్లలు కారు ఆపారు. నీ తండేల్ సినిమా చూశామంటూ వాళ్లు అతనితో చెప్పారు. దీంతో నీ పేరేంటి అంటూ వాళ్లందరినీ అడిగాడు. ఏం చదువుతున్నారు? ఎక్కడ చదువుతున్నారని ఆరా తీశాడు. అందులో ఒక పిల్లాడు తాను స్కూల్ కు వెళ్లడం లేదని, పోబుద్ధి కావడం లేదని, ఇప్పుడు షాప్ చూసుకుంటున్నానని సమాధానం ఇచ్చాడు.

పోబుద్ధి కావట్లేదా అని చైతూ కూడా అన్నాడు. ఆ తర్వాత ఆ పిల్లలందరికీ బాయ్ అని చెబుతూ వెళ్లిపోయాడు. అన్నా.. మళ్లీ సండే కలుద్దాం అని పిల్లలు చెప్పగా సరే అంటూ చైతూ ముందుకు కదిలాడు. ఈ వీడియోను ఆ పిల్లలే తమ దగ్గర ఉన్న మొబైల్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది.

ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా..

ఈ వీడియో చూసిన చైతన్య ఫ్యాన్స్ దీనిపై రియాక్ట్ అవుతున్నారు. ఓ పెద్దన్నలాగా నాగ చైతన్య పిల్లలతో మాట్లాడుతున్నాడు అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ఓ యూజర్ పోస్ట్ చేశాడు. “అతడు అందరికీ ఎంతో గౌరవమిస్తాడు. అందుకే అందరూ అతన్ని ఇష్టపడతారు” అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. చై చాలా మంచోడు.. ఇప్పటికే ఎంతో సింపుల్ గా ఉండే స్టార్ కిడ్ బహుషా ఇతడే కావచ్చు అని మరొకరు అభిప్రాయపడ్డాడు.

చైతన్య ఈ మధ్యే తండేల్ మూవీతో కెరీర్లోనే అతిపెద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైనే వసూలు చేసింది. సాయి పల్లవి కూడా నటించిన ఈ మూవీ తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోనూ దూసుకెళ్లింది. చైతన్య తాను తర్వాత నటించబోయే సినిమాల గురించి ఇంకా వెల్లడించలేదు. చాలా రోజుల తర్వాత తండేల్ రూపంలో దక్కిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం