లేటెస్ట్ పెయిర్ నాగా చైతన్య-శోభిత ధూళిపాళ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ టాలీవుడ్ కపుల్.. తాజాగా వోగ్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ ఆసక్తికర విషయాలు మీకోసం.
తప్పు చేయకపోయినా ఎవరు సారీ చెప్తారని అడిగిన ప్రశ్నకు.. తానే క్షమాపణ కోరుతానని శోభిత చెప్పింది. ఆ వెంటనే చైతూ మాట్లాడుతు.. ‘‘ఆమె సారీ, థాంక్యూలు నమ్మదు’’ అని కౌంటర్ ఇచ్చాడు. వింతైన అలవాట్ల గురించి మాట్లాడుతూ.. అలాంటివి శోభితకు కచ్చితంగా ఉన్నాయని చైతన్య పేర్కొన్నాడు. అయితే అవి చైతూకు నచ్చుతాయో లేదో అన్నది మాత్రం ప్రశ్నార్థకమే అన్నట్లు శోభిత టీజ్ చేసింది.
ఎవరు మంచి వంట చేస్తారు? ఫేవరెట్ డిష్ ఏంటి? అనే ప్రశ్నకు.. ఇద్దరిలో ఎవరం వంట చేయమని చైతన్య చెప్పాడు. శోభిత మాత్రం.. ‘‘ప్రతి రాత్రి అతను నాకోసం హాట్ చాక్లెట్ చేస్తాడు’’ అని ఆన్సర్ ఇచ్చాడు. వెంటనే ‘‘హాట్ చాక్లెట్, కాఫీ అలాంటివి కుకింగ్ కిందకు రావు. అవి బేసిక్ హ్యూమన్ స్కిల్స్. అవి నీకు లేవు’’ అని చైతన్య అన్నాడు.
చైతన్య సహజంగానే రొమాంటిక్‌గా ఉంటాడని, శోభిత మంచి పెప్ టాక్ ఇస్తుందని, ఫన్నీగా ఉంటుందని ఈ కపుల్ పేర్కొన్నారు. శోభిత డ్రైవ్ చేయదు కాబట్టి తానే పార్కింగ్ చలాన్ పొందే అవకాశం ఎక్కువగా ఉందని చై అన్నాడు. వెంటనే శోభిత ‘‘నేను డ్రైవ్ చేయను.. కానీ చైతన్యను మాత్రం పిచ్చెక్కిస్తా’’ అని చెప్పింది. సినిమాలు చూడటంలో శోభిత వెనకబడిందని చైతూ అన్నాడు. అయితే తన సినిమాలతోనే అది మొదలెడతానని శోభిత అంటే.. ఇంకేమన్నా మూవీస్ చూడు అని చైతూ ఆటపట్టించాడు.
అనారోగ్యం ఉన్నప్పుడు శోభిత ఎక్కువ డ్రామాలు చేస్తుందని చైతన్య అన్నాడు. కానీ తాను నిజంగానే సిక్ గా ఉంటానని, ఎక్కువ డ్రామాటిక్ మాత్రం చైతన్యనే అని శోభిత వెల్లడించింది. ఆర్గ్యుమెంట్ లో ఎవరు గెలుస్తారంటే కచ్చితంగా శోభితనే అని చైతూ అన్నాడు. ఫేమస్ పాటల హుక్ స్టెప్స్ నేర్పించడం శోభితకు అలవాటు అని చైతూ పేర్కొన్నాడు.
చైతన్య, శోభిత గతేడాది డిసెంబర్ 4న హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. చైతన్యకు మొదట సమంతతో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఈ జోడీ 2021లో విడిపోయింది.
సంబంధిత కథనం