Naga Chaitanya Sobhita Dhulipala: వివాహం తర్వాత జంటగా తొలిసారి గుడికి వెళ్లిన నాగచైతన్య, శోభిత.. ఇంతకీ ఏ గుడికో తెలుసా?
Naga Chaitanya Sobhita Dhulipala post wedding: రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల బుధవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి తొలిసారి గుడికి వెళ్లారు.
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం తర్వాత తొలిసారి జంటగా గుడికి వచ్చారు. డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పరిమిత సంఖ్యలో బంధువులు, అతిథుల సమక్షంలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
పెళ్లి తర్వాత నూతన వధూవరులు తొలిసారి బయటికి వచ్చి శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కొత్త జంట వెంట అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నాగచైతన్య, శోభితతో కలిసి నాగార్జున పూజలు చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఆలయంలో నాగచైతన్య, శోభిత ఫొటోలను తీస్తున్న వారిని ఉద్దేశిస్తూ నాగచైతన్య "మీరూ ఇక్కడికి ఎలా వచ్చారు?" అని సరదాగా అడగడంతో శోభిత ధూళిపాళ్ల నవ్వుతూ కనిపించింది. పూజలు, దర్శనానంతరం ఆలయ అధికారులతో కలిసి కొత్త జంట ఫొటోలు దిగింది.
సమంతతో విడాకుల తర్వాత రెండేళ్లు శోభిత ధూళిపాళ్లతో డేటింగ్‌లో ఉన్న నాగచైతన్య.. ఈ ఏడాది ఆగస్టులో ఇరు పక్షాల పెద్దల్ని ఒప్పించి ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో వీరి పెళ్లి అట్టహాసంగా జరిగింది. ప్రస్తుతం నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి అతని సరసన నటించగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకానుంది. శోభిత చివరి సారిగా లవ్- సితార చిత్రంలో నటించింది. ఈమె టాలీవుడ్ కంటే బాలీవుడ్, హాలీవుడ్‌లోనే సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో కనిపిస్తోంది.