Naga Chaitanya: సమంతతో విడాకుల్లో శోభిత తప్పేమీ లేదు.. నేనూ అలాంటి కుటుంబం నుంచే వచ్చా.. ఎంతో ఆలోచించే విడిపోయాం: చైతన్య
Naga Chaitanya: సమంతతో విడాకులపై విషయంపై నాగ చైతన్య మరోసారి స్పందించాడు. ఇందులో శోభిత తప్పేమీ లేదని, తాను కూడా బంధాలను తెంచుకున్న కుటుంబం నుంచే వచ్చానని అతడు అనడం గమనార్హం. పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు రా టాక్స్ విత్ వీకే పాడ్‌కాస్ట్ లో చెప్పాడు.

Naga Chaitanya: నాగ చైతన్య, సమంత పెళ్లి, విడాకుల వార్తలు రెండూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖంగా నిలిచిన సంగతి తెలుసు కదా. విడాకుల తర్వాత శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్న చైతన్య.. తాజాగా మరోసారి ఆ అంశంపై స్పందించాడు. సమంతతో విడాకుల విషయంలో శోభిత తప్పేమీ లేదని, అనవసరంగా ఆమెను అందులోకి లాగారని రా టాక్స్ విత్ వీకే పాడ్‌కాస్ట్ లో చెప్పాడు.
క్యాజువల్ గా కలిశాం. ఫ్రెండ్స్ అయ్యాం. అక్కడి నుంచి రిలేషన్షిప్ మొదలైంది. నా గతంతో ఆమెకు అసలు ఎలాంటి సంబంధం లేదు. ఆమె గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాకు బాధగా ఉంటుంది. ఆమెను లాగడం చాలా తప్పు" అని చైతన్య స్పష్టం చేశాడు.
నేనూ బంధాలు విచ్ఛిన్నమైన కుటుంబం నుంచే వచ్చా
సమంతతో విడాకుల విషయంలో తనను లాగినప్పుడు కూడా ఆమె ఎంతో సహనం, పరిణతితో వ్యవహరించిందని చైతన్య చెప్పాడు. తాను కూడా బంధాలు విచ్ఛిన్నమైన కుటుంబం నుంచే వచ్చానని, ఓ బంధానికి ముగింపు పలకడానికి ఎంతో ఆలోచిస్తానని ఈ సందర్బంగా అతడు చెప్పడం గమనార్హం.
"నేనూ ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. అందుకే ఓ బంధానికి ముగింపు పలకడానికి వేలసార్లు ఆలోచిస్తాను. అది పరస్పర నిర్ణయం. రాత్రికి రాత్రే జరిగింది కాదు. నాకూ బాధగానే ఉంది. కానీ ప్రతిదీ ఏదో ఒక కారణంతోనే జరుగుతుంది" అని చైతన్య అన్నాడు.
నాగార్జున, లక్ష్మి పెళ్లి, విడాకులు
నాగ చైతన్య తల్లి పేరు లక్ష్మి. ఆమె నటుడు వెంకటేశ్ చెల్లెలు. ఆమెను 1984లో నాగార్జున పెళ్లి చేసుకున్నాడు. నాగ చైతన్య పుట్టిన తర్వాత 1990లో వీళ్లు విడిపోయారు. ఆ తర్వాత 1992లో అమలను నాగార్జున పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు అఖిల్ జన్మించాడు.
ఇక చైతన్య విషయానికి వస్తే 2017లో అతడు సమంతను పెళ్లి చేసుకున్నాడు. 2021లో ఇద్దరూ విడిపోయారు. ఇక గతేడాది శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్యే తండేల్ మూవీతో నాగ చైతన్య చాలా రోజుల తర్వాత హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ.80 కోట్లు వసూలు చేసి రూ.100 కోట్ల వైపు వెళ్తోంది.
సంబంధిత కథనం
టాపిక్