Naga Chaitanya: తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు నాగచైతన్య నో చెప్పేశారా?
Naga Chaitanya: దర్శకుడు శివ నిర్వాణకు నాగచైతన్య నో చెప్పారని తెలుస్తోంది. తనకు మజిలీ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన ఆయనతో మూవీని చైతూ క్యాన్సిల్ చేశారట. ఇందుకు కారణమేంటంటే..
Naga Chaitanya: యువ సామ్రాట్ హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాలో బిజీగా ఉన్నారు. చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంలో శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రలో చైతూ నటిస్తున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఆ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్‍లో తండేల్ రానుంది. అయితే, తనకు మజిలీ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణతో నాగచైతన్య తదుపరి సినిమా చేయనున్నారని ఇటీవల టాక్ బయటికి వచ్చింది. అయితే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడిపోయినట్టు తెలుస్తోంది.
కథ నచ్చకపోవటంతో!
శివ నిర్వాణతో తదుపరి సినిమా చేసేందుకు నాగచైతన్య నో చెప్పేశారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. శివ రాసిన కథ నచ్చకపోవటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పటికి నిలిచిపోయింది. షైన్ స్క్రీన్ బ్యానర్ ఈ మూవీని నిర్మించాల్సి ఉండేది.
నాగచైతన్య కోసం శివ నిర్వాణ ఇంకో కథ రాస్తారా.. లేకపోతే వేరే హీరోతో ప్రాజెక్టుకు వెళ్లిపోతారా అనేది చూడాలి. ఇప్పటికేతై చైతూ - శివ చిత్రం దాదాపు క్యాన్సిల్ అయిపోయింది.
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషి సినిమా గతేడాది సెప్టెంబర్‌లో వచ్చి నిరాశపరిచింది. విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఆ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. కథలో కొత్తదనం లేదని, ఆకట్టుకునేలా తెరకెక్కించలేదని శివ నిర్వాణపై అసంతృప్తి వ్యక్తమైంది.
కాగా, నాగ చైతన్య - శివ నిర్వాణ కాంబినేషన్‍లో 2019లో వచ్చిన మజిలీ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ చిత్రంలో సమంత హీరోయిన్‍గా నచించారు. అప్పుడు భార్యభర్తలుగా ఉన్న చైతూ, సమంత ఆ ఎమోషనల్ లవ్ ఫ్యామిలీ డ్రామా మూవీలో అద్బుతంగా నటించారు. అయితే, తనకు మజిలీ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన నిర్వాణకు చైతూ ఇప్పుడు నో చెప్పేశారని తెలుస్తోంది. ప్రస్తుతం హిట్ కొట్టాలంటే డిఫరెంట్ కథలు అవసరమని చైతూ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
చైతూ నెక్స్ట్ మూవీ ఇదే..
విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో సినిమా చేసేందుకు నాగచైతన్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం మిస్టరీ థ్రిల్లర్‌గా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని బీవీఎస్‍ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. తండేల్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ షురూ కానుంది.
తండేల్ గురించి..
తండేల్ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పాకిస్థాన్ జైలులో నెలల పాటు హింస అనుభవించి.. స్వదేశానికి తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్య్సకారుల యథార్థ ఘటన ఆధారంగా మూవీని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. మత్స్యకారుడు రాజు పాత్రలో చైతూ నటిస్తున్నారు. ఆయనకు జోడీగా సాయిపల్లవి చేస్తున్నారు.
తండేల్ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకుంది. నాగచైతన్య మేకోవర్ కూడా అదిరిపోయింది. ఈ చిత్రం తెలుగుతో హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ కానుందని తెలుస్తోంది.