Naga Chaitanya Sobhita: శోభిత ధూళిపాళ, నాగ చైతన్య ఒకరి గురించి మరొకరు కొన్ని ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఇందులో వారి మధ్య సంబంధంలో ఎవరు మొదటి అడుగు వేశారు.. ఎవరు క్షమాపణలు చెబుతారు.. వారి వంట నైపుణ్యాలు, వారి వింత అలవాట్ల గురించి ఉండటం విశేషం. వోగ్ ఇండియా (Vogue India)తో మాట్లాడుతూ.. ఒకవేళ ప్రపంచ వినాశనం జరిగితే వారి మనుగడ నైపుణ్యాల గురించి కూడా శోభిత, నాగ చైతన్య మాట్లాడారు.
శోభిత, చైతన్య ఇంటర్వ్యూకు సంబంధించి వారి యూట్యూబ్ ఛానెల్‌లో.. వోగ్ ఒక వీడియోను పంచుకుంది. గొడవలు జరిగినప్పుడు మొదట ఎవరు సారీ చెబుతారన్న ప్రశ్నకు శోభిత స్పందిస్తూ.. తానే అని చెప్పింది. కానీ దీనికి చైతన్య కౌంటర్ ఇచ్చాడు.
ఆమె సారీలు, థాంక్యూలను నమ్మదని చైతన్య అనడం విశేషం. వారి వింత అలవాట్ల గురించి, వాటిలో ఏవి చూడటానికి ముద్దుగా అనిపిస్తాయో కూడా వీళ్లు చెప్పారు. శోభితలో ఇలాంటి అలవాట్లు కచ్చితంగా ఉన్నాయని చైతూ చెప్పాడు.
ఇక టాపిక్ వంట వైపు మళ్లింది. ఇద్దరిలో ఎవరు బాగా వంట చేస్తారని అడిగినప్పుడు.. తామిద్దరం వంట చేయమని చైతన్య అన్నాడు. అయితే వెంటనే శోభిత స్పందిస్తూ.. అతడు రోజూ రాత్రి తనకు హాట్ చాక్లెట్ చేసి ఇస్తాడని చెప్పింది. దీనికి కూడా చైతూ కౌంటర్ వేశాడు.
ఇవి వంట కిందికి రాదని, హాట్ చాక్లెట్, కాఫీలాంటి వంటలు కావని, ఆ సాధారణ స్కిల్స్ కూడా నీకు లేవని శోభితను ఆటపట్టించాడు. మెనీ థ్యాంక్స్ అంటూ శోభిత దీనిపై స్పందించింది. ఇక ఒకవేళ జాంబీ వినాశనం వస్తే.. ఎవరు ఎక్కువ కాలం తట్టుకోగలరు అనే ప్రశ్నకు.. ఇద్దరం అని వాళ్లు సమాధానమిచ్చారు.
చైతన్య చాలా రొమాంటిక్‌గా ఉంటాడని శోభిత చెప్పగా.. ఆమె మంచి ఎంకరేజింగ్ మాటలు చెబుతుందని, నవ్వుతూ ఉంటుందని చైతన్య చెప్పాడు. ఇక పార్కింగ్ చలాన్ వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ అనే ప్రశ్నకు.. శోభిత డ్రైవ్ చేయదు కాబట్టి అది తనకే వస్తుందని చైతన్య చెప్పాడు.
దీనికి శోభిత స్పందిస్తూ.. "నేను డ్రైవ్ చేయను. నేను అతనిని పిచ్చివాడిని చేస్తాను" అని చెప్పింది. సినిమాలు చూడటం గురించి అడిగిన ప్రశ్నకు.. శోభిత సినిమాలు ఎక్కువగా చూడదని చైతూ అన్నాడు.
ఎవరు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కువగా డ్రామా చేస్తారు అని ఈ జంటను అడిగినప్పుడు.. ఇద్దరూ ఒకరి పేర్లను మరొకరు చెప్పారు. చైతన్య చాలా డ్రామా క్రియేట్ చేస్తాడని శోభిత చెప్పగా.. "నువ్వు జ్వరంతో ఉన్నప్పుడు స్పృహ కోల్పోతున్నావు. కుప్పకూలుతున్నావు" అని అతను సమాధానం ఇచ్చాడు. ఆ సమయంలో తాను నిజంగా అనారోగ్యంగా ఉన్నానని, అదేమీ డ్రామా కాదని ఆమె చెప్పింది.
సంబంధిత కథనం