Naga Chaitanya Fish Curry: మత్స్యకారులకు చేపల పులుసు వండిపెట్టిన నాగ చైతన్య.. మాట నిలబెట్టుకున్న హీరో (వీడియో)
Naga Chaitanya Cooking Fish Curry Video Over Thandel Movie: హీరో నాగ చైతన్య మత్స్యకారులకు చేపల పులుసు వండిపెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదివరకు వారిలాగే చేపల పులుసు వండిపెడతానని మాటిచ్చిన నాగ చైతన్య నిలబెట్టుకున్నాడంటూ ఓ మత్స్యకారుడు ఆ వీడియోలో చెప్పాడు.
Naga Chaitanya Cooking Fish Curry Video: అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవలే శోభితా ధూళిపాళను రెండో వివాహం చేసుకున్న నాగ చైతన్య తండేల్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా మరసారి సాయి పల్లవి నటిస్తోన్న విషయం తెలిసిందే.
వీడియో వైరల్
కార్తికేయ, కార్తికేయ 2 డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు నాగ చైతన్య చేపల పులుసు వండిపెట్టడం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నాగ చైతన్య వండిన విధానం
గీతా ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఓ మత్య్సకారుడు ఇదివరకు నాగ చైతన్య వచ్చి తమలాగే చేపల పులుసు వండి తమకు పెడతానని చెప్పారని, ఇవాళ చేసి చూపించారని చెబుతాడు. ఆ తర్వాత వీడియోలో నాగ చైతన్య చేపల పులుసు వండిని విధానాన్ని అతను చెప్పుకొచ్చాడు.
చింతపండు పిండేసి
తమలాగే బాగా వండాడు అని అతను చెప్పాడు. "కట్టెల పొయ్యి వెలిగించి.. దాని మీద మట్టి పాత్ర పెట్టి, చేపలకు ఉప్పు అన్ని బాగా దట్టించి.. ఈలోపు బాగా వేడెక్కిన నూనెలో చేప ముక్కలు వేసి, అందులో చింతపండు పులుసు పిండేసి పులుసు పెట్టాడు" అని మత్స్యకారుడు చెప్పాడు. తర్వాత ఆ చేపల పులుసును టేస్ట్ చేసిన నాగ చైతన్య బాగుంది అని పక్కన ఉన్నవాళ్లకు చెప్పాడు.
వాసనకే నోరూరుతుందంటూ
పక్కన ఉన్నవాళ్లు కూడూ టేస్ట్ చేసి సూపర్, బాగుందని చెప్పారు. "కాసేపటికి మూకుడు తీసి సలసల ఉడుకుతున్న పులుసులో కొత్తిమీర వేస్తే అబ్బా ఆ వాసనకే నోరూరిపోయిందంతే" అని అతను చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ వీడియోలో నాగ చైతన్య చేపల పులుసు వండటమే కాకుండా అక్కడున్న వారందరికి వడ్డించాడు కూడా. వాళ్లంతా తిని బాగుందని చెప్పారు.
వందింతల ఫలితం
"నిజంగా బాగుందా. పక్కానా.. బాగోకపోతే ఏమనుకోకండి. ఫస్ట్ టైమ్" అని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. "మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి వందింతలు ఫలితం రావాలని రోజు ఆ దుర్గ భవానీ తల్లిని మొక్కుతున్నం" అనే వాయిస్ ఓవర్‌తో ఆ వీడియో ముగిసింది. అయితే, తండేల్‌లో శ్రీకాకుళం తీర ప్రాంతానికి చెందిన మత్స్యకారుడి పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నాడు.
నిజమైన మత్స్యకారుడిలా
మత్స్యకారులంతా రోజుల తరబడి చేపల వేటకు వెళ్తారు. అప్పుడు వారు సముద్రంలోనే చేపలు పట్టుకుని పడవలో పులుసు పెట్టుకుని తింటారు. అలా వారిలాగే నాగ చైతన్య కూడా చేపల పులుసు పెట్టడం నేర్చుకున్నాడు. నాగ చైతన్య పాత్రకు తగినట్లు తనను మల్చుకుంటున్నాడని చెప్పడానికి ఇది ఒక ఉదహారణ అని తెలుస్తోంది. కాగా తండేల్ మూవీ ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.