Naga Chaitanya: మా ఇంట్లో రూలింగ్ వాళ్లదే.. నా పరువు పోతుంది.. శోభిత ధూళిపాళపై నాగ చైతన్య కామెంట్స్
Naga Chaitanya About Sobhita Dhulipala In Thandel Trailer Launch: నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా మరోసారి నటించిన సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ ట్రైలర్ లాంచ్ ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో శోభిత ధూళిపాళను ఉద్దేశించి నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Naga Chaitanya About Sobhita Dhulipala In Thandel Trailer Launch: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఫిబ్రవరి 7న రిలీజ్
అలాగే, సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేస్తున్న చిత్ర యూనిట్ ఇటీవల తండేల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
గెస్ట్‌గా నిర్మాత అల్లు అరవింద్
వైజాగ్‌లోని రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో తండేల్ ట్రైలర్ లాంచ్ జరిగింది. అభిమానుల మధ్య ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకకు మెగా నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు హీరో అక్కినేని నాగచైతన్య హాజరయ్యారు. నాగచైతన్యకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఆదరించడంలోనే ఆనందం
తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "మేము చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. మేము ఎంత కష్టపడి తీసినా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది. మీరు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. చందూ మొండేటి ఈ కథను అత్యద్భుతంగా మలిచి చాలా బాగా తీశారు" అని అన్నారు.
గుండె కరిగిపోయేలా
"సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు. హీరో నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ సినిమాతో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించుకుంటారు" అని నిర్మాత అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
చిన్న ఊళ్లో జరిగిన కథ
"దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్‌ను చించిపడేశాడు. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊళ్లో జరిగిన కథను సినిమాగా తీశాం. ఉత్తరాంధ్ర వాళ్లంతా ఈ సినిమా చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది" అని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలిపారు.
పుష్ప కా బాప్
ఇక హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. "మన పుష్ప కా బాప్ అల్లు అరవింద్ గారు. ఏడాదిన్నర నుంచి నా లైఫ్‌లో నిజమైన తండేల్ (నాయకుడు) ఆయనే. చివరికి వచ్చేసరికి ఆయన లేకుండా ఇంకో సినిమా నేను ఎలా చేయగలను అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఉంది. ఆయన గైడెన్స్ చాలా విలువైనది. నేను జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా" అని తెలిపాడు.
పరువు పోతుంది
"వైజాగ్ విషయానికి వస్తే .. ఏ సినిమా రిలీజ్ అయినా వైజాగ్ టాక్ ఏంటి అనేది కనుక్కుంటా. ఇక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను ఇక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్లదే. కాబట్టి మీకో రిక్వెస్ట్.. తండేల్ సినిమాకు వైజాగ్‌లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేదంటే ఇంట్లో నా పరువు పోతుంది (నవ్వుతూ). ఈపాలి యాట తప్పేదేలేదు. ఫిబ్రవరి 7న థియేటర్లలో రాజులమ్మ జాతరే" అని నాగ చైతన్య అన్నారు.
సంబంధిత కథనం
టాపిక్