Thandel Movie: తండేల్ చిత్రానికి భారీ ఓపెనింగ్ ఖాయమేనా! ఈ 5 కారణాలు
Thandel Movie: తండేల్ చిత్రంపై మంచి హైప్ ఉంది. ఈ సినిమా మంచి ఓపెనింగ్ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీనికి 5 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
యువ సామ్రాట్ నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జోడీగా నటిస్తున్న తండేల్ చిత్రంపై ఫుల్ క్రేజ్ ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రాన్ని మేకర్స్ తీసుకొస్తున్నారు. కార్తీకేయ 2 లాంటి బంపర్ హిట్ కొట్టిన చందూ మొండేటి.. తండేల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తొలి రోజు భారీ కలెక్షన్లతో మంచి ఓపెనింగ్ దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. తండేల్ మూవీపై ఈ రేంజ్ బజ్ ఉండేందుకు ఐదు కారణాలు ఏవో ఇక్కడ చూడండి.

సాయిపల్లవి తెలుగు కమ్‍బ్యాక్
హీరోయిన్ సాయిపల్లవికి తెలుగులో చాలా ఫ్యాన్‍బేస్ ఉంది. హీరోలకు సమాన స్థాయిలో ఆమెను చాలా మంది అభిమానిస్తారు. చాలా సినిమా ఈవెంట్లలో గతంలో ఇది ప్రూవ్ అయింది. తండేల్ చిత్రంతో మూడేళ్ల తర్వాత తెలుగులో వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నారు సాయిపల్లవి. తెలుగులో చివరగా 2022లో విరాట్ పర్వం చిత్రంలో ఆమె నటించారు. ఆ తర్వాత గ్యాప్‍తో తండేల్ చిత్రంతో స్ట్రైట్ తెలుగు చిత్రం చేశారు. తమిళ మూవీ అమరన్‍తో గతేడాది సాయి పల్లవి మెప్పించారు. అయితే, స్ట్రైట్ తెలుగు చిత్రంలో తండేల్‍తో మూడేళ్ల తర్వాత కమ్‍బ్యాక్ చేస్తున్నారు. తండేల్ చిత్రానికి మంచి క్రేజ్ ఉండేందుకు సాయిపల్లవి ఓ ముఖ్యమైన కారణంగా ఉన్నారు. లిరికల్ వీడియోల్లో చూస్తే ఈ చిత్రంలో ఆమె డ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది.
నిజ జీవిత కథ.. దేశభక్తి, లవ్ స్టోరీతో..
2018లో శ్రీకాకుళానికి చెందిన మత్య్సకారులు గుజరాత్‍లో చేపల వేటకు దిగి అనుకోకుండా సముద్రంలో పాకిస్థాన్ హద్దులకు వెళ్లారు. అక్కడ పాక్ సైన్యానికి పట్టుబడ్డారు. పాక్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించారు. ఆ తర్వాత మళ్లీ భారత్‍కు చేరారు. వారిలో మత్స్యకారుడు రాజు కూడా ఒకరు. అతడి నిజ జీవిత కథ ఆధారంగానే తండేల్ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో దేశభక్తి, లవ్ స్టోరీ రెండు బలంగా ఉంటాయని టీజర్ ద్వారానే అర్థమైంది. ఈ స్టోరీలైన్ కూడా తండేల్‍పై ఆసక్తి మరింత పెంచేసింది.
చైతూ మేకోవర్, యాక్టింగ్.. సాయిపల్లవితో కెమిస్ట్రీ
శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగచైతన్య లుక్ బాగా సెట్ అయింది. మేకోవర్ కోసం అతడు పడిన శ్రమ.. ఇప్పటి వచ్చిన పోస్టర్లు, టీజర్లో స్పష్టంగా కనిపించింది. శ్రీకాకుళం యాస నేర్చుకునేందుకు, మత్స్యకారుల జీవన విధానం తెలుసుకునేందుకు కూడా చాలా హోంవర్క్ చేశారు చైతూ. ఈ మూవీకి నాగచైతన్య యాక్టింగ్ ఓ హైలైట్‍గా నిలుస్తుందని టీజర్ ద్వారానే అర్థమైంది. నాగచైతన్య, సాయిపల్లవి మధ్య కెమెస్ట్రీ మరోసారి కనుల విందు చేయనుందని పాటల లిరికల్ వీడియోల ద్వారానే తెలిసిపోయింది. గతంలో లవ్ స్టోరీ చిత్రంలో కలిసి నటించి మెప్పించిన ఇద్దరూ.. మరోసారి తండేల్‍లో జతకట్టారు.
పాపులర్ అయిన పాటలు
తండేల్ చిత్రం నుంచి ఇప్పటి వరకు మూడు పాటలు వచ్చాయి. ఇందులో బుజ్జి తల్లి పాట ఓ రేంజ్‍లో పాపులర్ అయింది. జనాల్లోకి బాగా వెళ్లింది. ఇటీవలే వచ్చిన హైలెస్సో హైలెస్సా కూడా మోతమోగుతోంది. శివశక్తి పాట కూడా ఆకట్టుకుంది. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారు. తండేల్ మూవీకి మంచి ఓపెనింగ్ దక్కేలా క్రేజ్ వచ్చేందుకు పాటలు కూడా ఓ ముఖ్యం కారణంగా ఉంది.
సోలో రిలీజ్
తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పోటీ లేదు. సోలో రిలీజ్‍కు వస్తుంది. దీంతో థియేటర్లు భారీగానే దక్కనున్నాయి. ప్రేక్షకుల ఫస్ట్ ప్రియారిటీ కూడా ఈ చిత్రమే కానుంది. ఇప్పటికే ఈ మూవీకి హైప్ ఉండగా.. సోలో రిలీజ్ కూడా తోడ్పడనుంది. తండేల్ సినిమాకు తొలి రోజు బాగా కలెక్షన్లు వచ్చేందుకు ఇది ఓ కారణంగా ఉండనుంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే.. ఆ తర్వాత కూడా కలెక్షన్లు భారీగా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తండేల్‍కు చందూ మొండేటి దర్శకుడు కావడం కూడా ప్లస్ పాయింట్‍గా ఉంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా సక్సెస్ సాధించి మెప్పించారు చందూ. తండేల్ చిత్రాన్ని కూడా చాలా రీసెర్చ్ చేసి తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ మూవీని గీతా ఆర్స్ట్ పతాకంపై బన్నీ వాసు నిర్మించగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ మూవీ సుమారు రూ.80కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని అంచనా.
సంబంధిత కథనం