Naga Babu on Allu Arjun: అల్లు అర్జున్ గురించి ఒక్కమాటలో నాగబాబు ఏం చెప్పారంటే..! ఇక చల్లారినట్టేనా..?
Nagababu on Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి వచ్చిన ప్రశ్నలకు నాగబాబు స్పందించారు. వివాదం తర్వాత తొలిసారి అల్లు అర్జున్‍పై రెస్పాండ్ అయ్యారు. దీంతో మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య విభేదాలు చల్లబడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలివే..
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చినట్టు స్పష్టంగా కనిపించింది. వైఎస్‍ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా రవికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు తెలుపడంతో ఇది మొదలైంది. తన మామ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్న వైసీపీకి చెందిన అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ దుమారం రేపింది. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఓ ట్వీట్ దీన్ని తీవ్రం చేసింది. దీంతో మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చినట్టు కనిపించింది. అయితే, ఇప్పుడు ఆ విభేదాలు చల్లారినట్టే కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ గురించి అడిగిన ప్రశ్నలకు నాగబాబు తాజాగా పాజిటివ్‍గా స్పందించారు.
పుష్ప 2 కోసం..
నాగబాబు రీసెంట్‍గా ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా క్వశ్చన్, ఆన్సర్స్ సెషన్ నిర్వహించారు. నెటిజన్లను ప్రశ్నలు అడగాలని ఆహ్వానించారు. ఆయనకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్‍కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. వీటికి ఆయన సమాధానాలు చెప్పారు.
‘అల్లు అర్జున్ సంగతి ఏంటి బాబాయ్’ అని ఓ నెటిజన్ నాగబాబును అడిగారు. “పుష్ప 2 కోసం వేచిచూస్తున్నా” అని నాగబాబు ఆన్సర్ ఇచ్చారు. వివాదంపై ఏదైనా చెప్పాలనేలా క్వశ్చన్ చేశారు ఆ నెటిజన్. అయితే, పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నా అంటూ పాజిటివ్ ఆన్సర్ ఇచ్చారు నాగబాబు.
హార్డ్ వర్కింగ్ అంటూ..
‘అల్లు అర్జున్ అన్న గురించి మీరు ఒక్క మాటలో చెప్పండి’ మరో యూజర్ అడిగారు. దీనికి ‘హార్డ్ వర్కింగ్’ అంటూ నాగబాబు సమాధానమిచ్చారు. అల్లు అర్జున్ బాగా కష్టపడే వ్యక్తి అంటూ ప్రశంసించారు.
విభేదాలు చల్లారినట్టే!
మెగా, అల్లు కుటుంబాల మధ్య క్రమంగా విభేదాలు చల్లారినట్టే ఇటీవల పరిణామాలు అనిపిస్తున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి నాగబాబు పాజిటివ్‍గా స్పందించటంతో రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ పూర్తిగా సమసిపోయిందనే అర్థమవుతోంది. సోషల్ మీడియాలోనూ మెగా, అల్లు ఫ్యాన్స్ యుద్ధం కూడా క్రమంగా తగ్గుతోంది.
వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించాక.. నాగబాబు అప్పట్లో ఓ ట్వీట్ చేశారు. “మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు.. మా వాడైనా పరాయివాడే” అంటూ ఓ పోస్ట్ చేశారు. ఆయన అల్లు అర్జున్ గురించే అలా అన్నారంటూ దుమారం రేగింది. మెగా, అల్లు అభిమానుల మధ్య కూడా సోషల్ మీడియాలో వార్ మొదలైంది. పవన్ కల్యాణ్ గెలుపు సంబరాల్లోనూ, ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలోనూ అల్లు కుటుంబ సభ్యులెవరూ పాల్గొనలేదు. దీంతో విభేదాలు తీవ్రంగా ఉన్నాయనే రూమర్లు వచ్చాయి. అయితే, ఇప్పుడిప్పుడే ఇవి సర్దుకున్నట్టు అనిపిస్తోంది.
మెగా, అల్లు కుటుంబాలకు దగ్గరగా ఉండే నిర్మాత బన్నీ వాసు కూడా ఇటీవల ఈ విషయంపై స్పందించారు. విభేదాలు సమసిపోయాయనేలా మాట్లాడారు. అయితే, మళ్లీ మెగా, అల్లు కుటుంబాలను ఒకచోట చూడాలని అభిమానులు వేచిచూస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సీక్వెల్ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.