Nag Ashwin: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. పదకొడు రోజుల్లోనే ఈ మూవీ 900 కోట్ల మైలురాయికి చేరువైంది. ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా కల్కి రికార్డ్ నెలకొల్పింది. ఈ సూపర్ హీరో మూవీ పదిహేను వందల కోట్ల కలెక్షన్స్‌ను దాటేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
కల్కి సక్సెస్‌ను ఆస్వాదిస్తోన్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమా కోసం నాలుగేళ్ల పాటు నాగ్ అశ్విన్ పడిన కష్టాన్ని సక్సెస్ మొత్తం మరపిస్తోంది. అయితే కల్కిలోని విజువల్స్, గ్రాఫిక్స్‌ను హాలీవుడ్ మూవీస్‌తో కొంతమంది కంపేర్ చేస్తోన్నారు. ఈ కంపేరిజన్స్‌పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
కల్కి ఐడియా డెవలప్ చేసుకోవడంలో హాలీవుడ్ సినిమాలుఉపయోగపడ్డాయి తప్పితే ఏ మూవీ నుంచి కథ, క్యారెక్టర్లను తాను కాపీ కొట్టలేదని నాగ్ అశ్విన్ వెల్లడించాడు. ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో మార్వెల్ సినిమాలకు కల్కి కాపీ అంటూ ఎదురైన ప్రశ్నకు నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
మార్వెల్ సినిమాలను నేను బాగా చూస్తుంటాను. అయితే మార్వెల్ కంటే సూపర్ హీరో జానర్‌లో వచ్చిన గార్డియన్ ఆఫ్ గెలాక్సీ, స్టార్ వార్స్ అంటే నాకు చాలా ఇష్టం. హిస్టారికల్, మైథలాజీ నుంచి స్ఫూర్తి పొందతూ అందులోని సూపర్ హీరో క్యారెక్టర్స్ రాసుకున్న తీరు బాగుంది.. కల్కి ఐడియాను డెవలప్ చేసుకోవడంలో ఆ సినిమాలపై ప్రభావం నాపై కొంత ఉంది. క ఆ సినిమాలు ఓ రిఫరెన్స్‌గా ఉపయోగపడ్డాయి తప్పితే వాటికి క ల్కి కథకు ఎలాంటి సంబంధం లేదు అని నాగ్ అశ్విన్ అన్నాడు.
హారీ పోటర్ విలన్ వోల్డ్ మార్ట్ క్యారెక్టర్, లుక్‌ను కాపీ కొట్టి కల్కిలో కమల్‌హాసన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లుగా వచ్చిన వార్తలపై నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. 120 నుంచి 130 ఏళ్ల క్రితం నాటి టిబెటన్ మత గురువుల లుక్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని కమల్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసుకున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపాడు.
నేను సిద్ధం చేసిన లుక్ చూసి ఓ ఆంగ్ల నవలలో పాపులర్ అయిన డోరియన్ గ్రేను పోలి ఉందని కమల్ అన్నారు. ఇలా ఒక్కొక్కరికి ఆయన పాత్ర ఒక్కోలా కనిపిస్తుంది. కొందరు ఆయన పాత్రను హాలీవుడ్ మూవీస్‌తో కంపేర్ చేస్తున్నారు. కానీ ఏ సినిమా నుంచి స్ఫూర్తి పొందుతూ ఆయన పాత్రను సిద్ధం చేసుకోలేదు అని నాగ్ అశ్విన్ అన్నాడు.
భారతీయ పురాణాలకు గ్రాఫిక్స్, యాక్షన్ హంగులను జోడించి దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి మూవీని రూపొందించాడు. ఈ సినిమాలో భైరవ అనే సూపర్ హీరోగా, కర్ణుడిగా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో ప్రభాస్ కనిపించాడు. ప్రభాస్, అమితాబ్‌బచ్చన్ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్‌లను థియేటర్లలో ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తోన్నారు.
కల్కి మూవీలో దీపికా పదుకోణ్ తో పాటు దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. కల్కితోనే దీపికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో కమల్‌హాసన్ విలన్‌గా నటించగా...అశ్వత్థామగా ప్రభాస్‌కు ధీటైన పాత్రలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్‌బచ్చన్ కనిపించాడు. కల్కి 2898 ఏడీలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తో పాటు డైరెకర్లు రాజమౌళి, ఆర్‌జీవీ, అనుదీప్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ఫఱియా అబ్దుల్లా గెస్టు రోల్స్‌లో కనిపించారు.