Nag Ashwin: నా చెప్పులు చూడండి ఎలా అయ్యాయో..: కల్కి 2898 ఏడీ రిలీజ్ రోజే నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్
Nag Ashwin: కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ నాడే డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో తన చిరిగిన చెప్పుల ఫొటోను అతడు షేర్ చేయడం విశేషం.

Nag Ashwin: కల్కి 2898 ఏడీ మూవీతో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారిపోయాడు నాగ్ అశ్విన్. హిందూ పురాణాలను సైన్స్ కు ముడిపెట్టి తీసిన ఈ అద్భుతం హాలీవుడ్ రేంజ్ లో ఉందంటూ అందరూ రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఇలాంటి సినిమా తీయడానికి తాను పడిన కష్టం ఎలాంటిదో చెబుతూ మూవీ రిలీజ్ రోజే నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో తన చెప్పుల ఫొటోను షేర్ చేయడం విశేషం.
చిరిగిన చెప్పుల స్టోరీ
కల్కి 2898 ఏడీ మూవీ వెనుక నాగ్ అశ్విన్ నాలుగేళ్ల శ్రమ దాగి ఉంది. ఎంతో భారీ బడ్జెట్, ఎంత మంది స్టార్లు ఉన్నా కూడా.. కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా పేరుగాంచిన డైరెక్టర్ పాత్రను అసలు మరువలేం. అందుకే సినిమా కోసం తాను పడిన కష్టాన్ని గుర్తు చేసేలా తన చిరిగిన చెప్పుల ఫొటోను రిలీజ్ రోజే పోస్ట్ చేశాడతడు. “ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం” అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయడం విశేషం.
ఈ పోస్ట్ ద్వారా అతడు ఎంతో భావోద్వేగానికి గురైనట్లు స్పష్టమవుతోంది. కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కు ముందు నాగ్ అశ్విన్ ఎన్నో పోస్టులు చేసినా.. ఇది మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచిందని చెప్పాలి. తాను పడిన శ్రమను సింపుల్ గా ఇలా తన చిరిగిన చెప్పుల ఫొటోను పోస్ట్ చేయడం ద్వారా నాగ్ అశ్విన్ చెప్పడం విశేషం. నిజానికి ఈ చెప్పుల వెనుక ఓ స్టోరీ కూడా ఉంది.
గతంలోనూ అతడు ఈ చెప్పులను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. తన చెప్పుకు ముల్లులా ఉన్న కుట్టును చూపిస్తూ.. ఇది తనకో రిమైండర్ అని అనడం విశేషం.
కల్కి 2898 ఏడీ రెస్పాన్స్
కల్కి 2898 ఏడీ మూవీకి ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అసలు ఊహకందని విధంగా మూవీని తీసినట్లు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీకి మించి అడ్వాన్స్ బుకింగ్స్ జరగగా.. ఫస్ట్ డే కలెక్షన్లు రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
ఇక ఈ సినిమాను చూసిన దర్శక ధీరుడు రాజమౌళి కూడా మూవీ అద్భుతమంటూ కొనియాడాడు. సినిమా చూస్తుంటే తానో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉందని ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఇవన్నీ చూసిన ఫ్యాన్స్ ఇది కచ్చితంగా మరో రూ.1000 కోట్ల సినిమా అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు.
నిజానికి సినిమాలో ప్రభాస్ కనిపించే సమయం తక్కువే అయినా.. ఉన్నంతసేపు కూడా భైరవ పాత్రలో అతడు తన టైమింగ్ తో అదరగొట్టినట్లు చెబుతున్నారు. సూపర్ హీరోగా అతడి క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రభాస్‌పై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయి. ప్రభాస్ క్యారెక్టర్‌కు ధీటుగా అశ్వత్థామ పాత్రను రాసుకున్నాడు దర్శకుడు. అమితాబ్‌బచ్చన్ డైలాగ్ డెలివరీ, అతడి స్క్రీన్‌ప్రజెన్స్ వావ్ అనిపిస్తాయి.
యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. ఎమోషనల్ రోల్‌లో దీపికా పదుకోణ్ కనిపించింది. తన బిడ్డ కోసం ఆరాటపడే తల్లిగా నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచింది. కమల్‌హాసన్ సినిమాలో కేవలం పది నిమిషాల లోపే కనిపిస్తారు. సెకండ్ పార్ట్‌లోనే ఆయన క్యారెక్టర్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుందని డైరెక్టర్ హింట్ ఇచ్చాడు.