OTT Romantic Comedy: థియేటర్లలో డీలా పడినా ఓటీటీలో దుమ్మురేపుతున్న నభా నటేష్ కామెడీ సినిమా
OTT Romantic Comedy: డార్లింగ్ సినిమా థియేటర్లలో బొల్తా కొట్టింది. అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లు రాలేదు. నభా నటేష్, ప్రియదర్శి నటించిన ఈ మూవీ నెల ముగియకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఓటీటీలో ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. ప్రస్తుతం టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..
డార్లింగ్ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో నుంచి ట్రైలర్ వరకు చాలా హైప్ క్రియేట్ చేసింది. దీంతో హీరోయిన్ నభా నటేష్, ప్రియదర్శి లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా జూలై 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, డార్లింగ్ సినిమా ఎక్కువగా నెగెటివ్ టాక్ వచ్చేసింది. ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో కలెక్షన్లు అనుకున్న స్థాయిలో రాలేదు. ఈ సినిమా నెలలోగానే ఓటీటీలోకి వచ్చింది.
ఓటీటీలో టాప్ ట్రెండింగ్‍లోకి..
డార్లింగ్ సినిమాకు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈ చిత్రం ఈ వారమే ఆగస్టు 13వ తేదీన హాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన నెలలోగానే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. అయితే, ఈ మూవీ ప్రస్తుతం (ఆగస్టు 15) హాట్‍స్టార్ ఓటీటీలో తెలుగు ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది.
థియేటర్లలో డీలాపడ్డ డార్లింగ్ మూవీకి హాట్‍స్టార్ ఓటీటీలో మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావటంతో చాలా మంది థియేటర్లలో చూడలేదు. దీంతో ఓటీటీలో ఓ లుక్కేస్తున్నారు. దీంతో ఈ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. హైప్ ఎక్కువగా ఉండటంతో డార్లింగ్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్‍స్టార్ మంచి ధరకు తీసుకుంది.
డార్లింగ్ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. భార్యతో పారిస్ వెళ్లాలనుకునే కలలు గనే యవకుడు, స్ల్పిట్ పర్సానాలిటీ ఉండే అమ్మాయి పాయింట్లతో కథ రాసుకున్నారు. అయితే, అంత ఎఫెక్టివ్‍గా తెరపై చూపలేకపోయారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పర్ఫార్మెన్స్ మెప్పించినా.. నభా నటేష్ యాక్టింగ్ పెద్దగా ఆకట్టుకోలేదనే కామెంట్లు వచ్చాయి. ఈ మూవీలో విష్ణు, బ్రహ్మానందం, అనన్య నాగళ్ల, కృష్ణ చైతన్య, మురళీధర్ గౌడ్ కీరోల్స్ చేశారు.
డార్లింగ్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. రూ.8కోట్ల లోపు బడ్జెట్‍తోనే ఈ మూవీ రూపొందింది. థియేట్రికల్ హక్కులు, ఓటీటీ, శాటిలైట్ హక్కులతో రిలీజ్‍కు ముందే నిర్మాతలకు లాభాలు వచ్చాయని తెలిసింది. అయితే, థియేటర్ల మాత్రం ఈ చిత్రం కలెక్షన్లు అనుకున్నస్థాయిలో రాబట్టలేకపోయింది.
డార్లింగ్ సినిమా స్టోరీ
భార్యతో కలిసి పారిస్‍కు హనీమూన్‍కు వెళ్లాలని కలలు గనే రాఘవ (ప్రియదర్శి), స్ల్పిట్ పర్సనాలిటీతో వింతగా ప్రవర్తించే ఆనంది (నభా నటేష్) మధ్య డార్లింగ్ స్టోరీ సాగుతుంది. నందిని (అనన్య నాగళ్ల)తో రాఘవ పెళ్లి కుదురుతుంది. అయితే, కాసేపట్లో వివాహం అనగా నందిని పారిపోతుంది. దీంతో రాఘవ ఇక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడే అతడికి ఆనంది పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య మాటలు సాగుతాయి. పరిచయం ఏర్పడుతుంది. కాస్త పరియానికే రాఘవ, ఆనంది పెళ్లి చేసుకుంటారు.
ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ సమస్య ఉందని పెళ్లి తర్వాత తొలి రాత్రే రాఘవకు అర్థమవుతుంది. దీంతో ఆమెతో అష్టకష్టాలు పడుతుంటాడు. భార్యతో పారిస్ వెళ్లాలనే అతడి కోరిక సందిగ్ధంలో పడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆనందికి ఆ సమస్య ఎందుకు వచ్చింది? రాఘవ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? చివరికి పారిస్‍కు వెళ్లాడా? అనేదే డార్లింగ్ సినిమాలో ఉంటాయి.