మనసు లోతుల్లోకి వెళ్లిపోయే అక్షరాలు.. కుబేర సినిమాలోని నా కొడుకా సాంగ్ లిరిక్స్.. ఎక్కడ విన్నా ఇదే పాట!-naa koduka song lyrics kubera movie dhanush nagarjuna rashmika sekhar kammula dsp ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మనసు లోతుల్లోకి వెళ్లిపోయే అక్షరాలు.. కుబేర సినిమాలోని నా కొడుకా సాంగ్ లిరిక్స్.. ఎక్కడ విన్నా ఇదే పాట!

మనసు లోతుల్లోకి వెళ్లిపోయే అక్షరాలు.. కుబేర సినిమాలోని నా కొడుకా సాంగ్ లిరిక్స్.. ఎక్కడ విన్నా ఇదే పాట!

ఈ మధ్య ఎక్కడ విన్నా ఒకే పాట వినిపిస్తోంది. ఇంట్లో, బయట ఇదే ట్రెండ్ అవుతోంది. ఆ లిరిక్స్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తున్నాయి. అదే కుబేర సినిమాలోని ‘నా కొడుకా’ పాట. ఆ సాంగ్ కు మీరు కూడా ఫిదా అయిపోయారా? అయితే ఇంకెందుకు లేటు ఈ లిరిక్స్ పాడేయండి.

నా కొడుకా సాంగ్ లిరిక్స్ (youtube)

సినిమా పాటలు చాలా రకాలు. కొన్ని అర్థం కావు. మరికొన్ని లిరిక్స్ వినిపించకుండానే డీజే మోతలతో ఉంటాయి. కానీ కొన్ని పాటలు మాత్రం మనసును హత్తుకుంటాయి. లోపలికి చొచ్చుకెళ్లిపోతాయి. ఏ పని చేసినా అవే గుర్తుకు వస్తాయి. ఆ పాటల్లోని పదాలు మనల్ని వెంటాడుతాయి. రీసెంట్ గా వచ్చిన కుబేర సినిమాలోని ‘నా కొడుకా’ పాట కూడా ఇలాంటిదే.

తల్లి పాటగా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని నా కొడుకా పాట పాపులర్ అయింది. లోకం తీరు ఎలా ఉందో తన కొడుక్కి చెప్పే అమ్మ పాటగా ఇది సాగుతుంది. నంద కిశోర్ అద్భుతమైన లిరిక్స్ రాశారు. సిందూరి విశాల్ ఎంతో చక్కగా పాడారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

ఇదిలో లిరిక్స్

పచ్చ పచ్చని చెలల్లో

పూసేటి పువ్వుల తావుల్లో

నవ్వులు ఏరుతు నడిచేద్దాము

చేతులు పట్టుకో నా కొడుకా..

కడుపున నిన్ను దాచుకుని

నీడల్లే నిన్ను అంటుకుని

కలిసే ఉంటా ఎప్పటికీ

నీ చేతిని వదలను నా కొడుకా..

పదిలంగా నువు నడవలే

పది కాలాలు నువు బతకాలే

చందమామకు చెబుతున్నా

నిను చల్లగా చూస్తది నా కొడుకా..

ఆకలితో నువ్వు పస్తుంటే

నీ డొక్కలు ఎండిపోయేరా

చెట్టు చెట్టుకి చెబుతున్నా

నీ కడుపు నింపమని నా కొడుకా..

నిద్దురలేక నువ్వుంటే

నీ కన్నులు ఎర్రగా మారేరా

నీలి మబ్బుతో చెబుతున్నా

నీ జోల పాడమని నా కొడుకా..

మనుషికి మనిషే దూరమురా

ఇది మాయా లోకపు ధర్మమురా

బడిలో చెప్పని పాఠం ఇదిరా

బతికే నేర్చుకో నా కొడుకా..

తిడితే వాళ్లకే తగిలేను

నిను కొట్టిన చేతులు విరిగేను

ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు

ఓపికతోటి నా కొడుకా..

రాళ్ళు రప్పల దారులు నీవి

అడుగులు పదిలం ఓ కొడుకా

మెత్తటి కాళ్ళు ఒత్తుకు పోతాయి

చూసుకు నడువురా నా కొడుకా..

చుక్కలు దిక్కులు నేస్తులు నీకు

చక్కగా బతుకు ఓ కొడుకా

ఒక్కనివనుకొని దిగులైపోకు

పక్కనే ఉంటా నా కొడుకా..

పాణము నీది పిట్టల తోటిది

ఉచ్చుల పడకు ఓ కొడుకా

ముళ్ళ కంపలో గూడు కట్టేటి

నేర్పుతో ఎదగారా నా కొడుకా..

ఏ దారిలో నువ్వు పోతున్నా

ఏ గండం నీకు ఎదురైనా

ఏ కీడు ఎన్నడు జరగదు నీకు

అమ్మ దీవెనిది నా కొడుకా..

ఈ దిక్కులు నీతో కదిలేను

ఆ చుక్కలే దిష్టి తీసేను

ఏ గాలి ధూళి సోకదు నిన్ను

అమ్మ దీవెనిది నా కొడుకా..

ఏ పిడుగుల చప్పుడు వినపడినా

ఏ బూచోడికి నువ్వు భయపడినా

ఈ చీకటి నిన్నేం చెయ్యదులేరా

అమ్మ దీవెనిది నా కొడుకా..

అమ్మ దీవెనిది నా కొడుకా..

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం