Prabhas - Siddharth Anand Movie: పఠాన్ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ మూవీ - ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ఇదే-mythri movie makers to produce prabhas siddharth anand movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mythri Movie Makers To Produce Prabhas Siddharth Anand Movies

Prabhas - Siddharth Anand Movie: పఠాన్ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ మూవీ - ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ఇదే

HT Telugu Desk HT Telugu
Jan 13, 2023 10:48 PM IST

Prabhas - Siddharth Anand Movie: ప‌ఠాన్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్ర‌భాస్ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ పాన్ ఇండియ‌న్ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయ‌బోతున్న‌ది. ఆ నిర్మాణ సంస్థ ఏదంటే...

ప్ర‌భాస్
ప్ర‌భాస్

Prabhas - Siddharth Anand Movie: బాలీవుడ్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్ర‌భాస్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లుగా చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ కాంబోపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. పాన్ ఇండియ‌న్ స్థాయిలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ఈ బాలీవుడ్ ద‌ర్శ‌కుడితో నిర్మాత‌లు ఇప్ప‌టికే సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు తెలిసింది. ఈ సినిమాను నిర్మించేందుకు మైత్రీ మూవీస్ రెడీగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది చివ‌ర‌లో ప్ర‌భాస్‌, సిద్ధార్థ్ ఆనంద్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ మ‌రో కథానాయకుడిగా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారంజ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం షారుఖ్‌ఖాన్‌తో ప‌ఠాన్ సినిమా చేస్తోన్నాడు సిద్ధార్థ్ ఆనంద్‌. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా జ‌న‌వ‌రి 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జాన్ ఆబ్ర‌హ‌మ్ విల‌న్‌గా కనిపించబోతున్నాడు.

మ‌రోవైపు ప్ర‌భాస్ ప్ర‌స్తుతం నాలుగు పాన్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది.

కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌తో స‌లార్ సినిమా చేస్తున్నాడు. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్నాడు. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌తో సూప‌ర్ హీరో క‌థాంశంతో ప్ర‌భాస్ చేస్తోన్న ప్రాజెక్ట్ కే షూటింగ్ ద‌శ‌లో ఉంది. వీటితో పాటు ద‌ర్శ‌కుడు మారుతి - ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న‌ది.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.