పాప మిస్సింగ్ కేస్.. ఓటీటీలోకి మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్..సూపర్ ట్విస్ట్.. లేడీ డాన్‌గా ఉద‌య‌భాను..9.3 ఐఎండీబీ రేటింగ్-mystery thriller tribanadhari barbarik ott release date announced movie will streaming on sun nxt from october 10th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  పాప మిస్సింగ్ కేస్.. ఓటీటీలోకి మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్..సూపర్ ట్విస్ట్.. లేడీ డాన్‌గా ఉద‌య‌భాను..9.3 ఐఎండీబీ రేటింగ్

పాప మిస్సింగ్ కేస్.. ఓటీటీలోకి మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్..సూపర్ ట్విస్ట్.. లేడీ డాన్‌గా ఉద‌య‌భాను..9.3 ఐఎండీబీ రేటింగ్

ఓటీటీలోకి అదిరిపోయే మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతుంది. మైండ్ బ్లాక్ ట్విస్ట్ లతో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో ఆడియన్స్ కు థ్రిల్ పంచింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది.

ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ (x/rameshlaus)

ఓటీటీలోకి లేటేస్ట్ తెలుగు సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ త్రిబాణధారి బార్బరిక్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (అక్టోబర్ 5) ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్.సింహ, సత్యం రాజేశ్, సాంచీ రాయ్ తదితరులు నటించారు.

త్రిబాణధారి బార్బరిక్ ఓటీటీ

సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్.సింహ కీలక పాత్రలు పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ త్రిబాణధారి బార్బరిక్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఆదివారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.

‘‘ప్రేమ, నష్టం, బద్దలు కాని బంధం. తన మనవరాలిని కనిపెట్టడం కోసం సైకియాట్రిస్ట్ పోరాటం. త్రిబాణధారి బార్బరిక్ అక్టోబర్ 10 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది’’ అని సన్ నెక్ట్స్ ఎక్స్ లో పోస్టు చేసింది.

నెల తర్వాత

త్రిబాణధారి బార్బరిక్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స డైరెక్టర్. ఈ చిత్రానికి 9.3 ఐఎండీబీ రేటింగ్ ఉంది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబర్ 10 నుంచి సన్ నెక్ట్స్ లో తెలుగుతో పాటు తమిళంలో స్ట్రీమింగ్ కానుంది.

త్రిబాణధారి బార్బరిక్ కథ

త్రిబాణధారి బార్బరిక్ మూవీ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇందులో ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను లేడీ డాన్ రోల్ ప్లే చేయడం విశేషం. శ్యామ్ కతు (సత్యరాజ్) ఓ ఫేమస్ సైకియాట్రిస్ట్. తన కొడుకు, కోడలు చనిపోవడంతో మనవరాలు నిధిని ముద్దుగా పెంచుకుంటాడు.

పాప మిస్సింగ్

ఓ రోజు స్కూల్ కు వెళ్లిన నిధి మిస్ అవుతుంది. పోలీసులకు కంప్లయింట్ ఇస్తే కేసు ఎంక్వైరీ చేస్తారు. మరి ఆ పాప ఏమైంది? ఇందులో లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను), ఊర్లో ఉంటే రామ్ (వశిష్ఠ ఎన్ సింహా)కు సంబంధం ఏంటీ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ సినిమాకు మహాభారతంలోని ఘటోత్కచుడి కొడుకు బార్బరిక్ పేరు పెట్టడం కూడా మూవీపై ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకునే డిజిటల్ ఆడియన్స్ కు ఈ మూవీ మంచి ఆప్షన్.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం