Heroines: 12 మంది హీరోయిన్స్‌తో క్యాలెండర్.. ఈ ఏడాది మరో ఐదుగురి ఎంట్రీ.. కలర్‌ఫుల్‌గా మై సౌత్ దివా క్యాలెండర్ 2025-my south diva calendar 2025 launch event with 12 heroines shriya saran kajal agarwal of photographer manoj kumar katokar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heroines: 12 మంది హీరోయిన్స్‌తో క్యాలెండర్.. ఈ ఏడాది మరో ఐదుగురి ఎంట్రీ.. కలర్‌ఫుల్‌గా మై సౌత్ దివా క్యాలెండర్ 2025

Heroines: 12 మంది హీరోయిన్స్‌తో క్యాలెండర్.. ఈ ఏడాది మరో ఐదుగురి ఎంట్రీ.. కలర్‌ఫుల్‌గా మై సౌత్ దివా క్యాలెండర్ 2025

Sanjiv Kumar HT Telugu
Jan 25, 2025 01:20 PM IST

My South Diva Calendar 2025 Launch With 12 Heroines: స్టార్ హీరోయిన్స్‌ను ముందుగా మోడల్స్‌గా పరిచయం చేసిన మై సౌత్ దివా క్యాలెండర్స్ ఈ ఏడాది 12 మంది హీరోయిన్స్‌తో లాంచ్ చేశారు. ఈ క్యాలెండర్‌ను శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ ఇతర హీరోయిన్స్ లాంచ్ చేశారు.

12 మంది హీరోయిన్స్‌తో క్యాలెండర్.. ఈ ఏడాది మరో ఐదుగురి ఎంట్రీ.. కలర్‌ఫుల్‌గా మై సౌత్ దివా క్యాలెండర్ 2025
12 మంది హీరోయిన్స్‌తో క్యాలెండర్.. ఈ ఏడాది మరో ఐదుగురి ఎంట్రీ.. కలర్‌ఫుల్‌గా మై సౌత్ దివా క్యాలెండర్ 2025

12 Heroines In My South Diva Calendar 2025 Launch: ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ మనోజ్‌ కుమార్ కటోకర్ రూపొందించిన ప్రతిష్టాత్మక మై సౌత్‌ దివా క్యాలెండర్‌ ద్వారా ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పరిచయమై.. స్టార్స్‌గా క్రేజ్ అందుకున్నారు. తాజాగా మై సౌత్ దివా 2025 క్యాలెండర్‌ను 12 మంది స్టార్స్‌తో శుక్రవారం (జనవరి 24) గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

కాజల్, శ్రియా చేతులమీదుగా

హీరోయిన్స్ శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ, తాన్య హోప్, ఐశ్వర్య కృష్ణ, కుషిత కొల్లాపు, వినాలీ భట్నాగర్, రియా సచ్ దేవ్, కనిక మాన్, పలక్ అగర్వాల్‌తో మై సౌత్ దివా క్యాలెండర్ 2025ను శుక్రవారం హైదరాబాద్‌లో కలర్‌ఫుల్‌గా ఆవిష్కరించారు. ఈ ఈవెంట్‌లో క్యాలెండర్ ఫౌండర్ మనోజ్ కుమార్ కటొకర్, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డితోపాటు సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్, దర్శకులు కరుణ కుమార్, సుజనా రావు ముఖ్య అతిథులుగా హాజరై తమ విషెస్ తెలియజేశారు.

ఈ సందర్భంగా మై సౌత్ దివా క్యాలెండర్ ఫౌండర్, ఫోటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటొకర్ మాట్లాడుతూ.. "మా క్యాలెండర్‌ను తొమ్మిది ఏళ్లుగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 12 మంది హీరోయిన్స్‌తో కూడిన ఈ క్యాలెండర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా" అని అన్నారు.

మరో ఐదుగురు ఇంట్రడ్యూస్

"మా క్యాలెండర్ ద్వారా ఇప్పటికే కొత్తవారిని మోడల్స్‌గా పరిచయం చేశాం. అలాగే కొంతమంది హీరోయిన్స్‌గా మంచి గుర్తింపును అందుకున్నారు. ఈ ఏడాది మరో ఐదుగురిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ జర్నీలో నాకు సపోర్ట్‌గా నిలిచిన మా పార్ట్నర్స్ భారతి సిమెంట్స్, కియారా జ్యువెలరీ, ఈరా క్లినిక్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు" అని మనోజ్ కుమార్ కటోకర్ చెప్పారు.

ఇదే ఈవెంట్‌లో డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ.. "పలాస మూవీ టైమ్‌లో మనోజ్ గారు నాకు చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఆయనతో నాకు ఐదేళ్ల జర్నీ ఉంది. ఇప్పటికీ నా సినిమాల్లో హీరోయిన్స్ కోసం ఆయన రిఫరెన్స్ తీసుకుంటాను. ఈ సందర్భంగా పలాస చిత్రాన్ని మార్చి 6న రీ రిలీజ్ చేయాలని ప్రకటిస్తున్నాం" అని తెలిపారు.

కలర్స్ చాలా బాగున్నాయి

"ఈ క్యాలెండర్‌‌లోని కలర్స్‌ చాలా బాగున్నాయి. మనోజ్ చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేస్తారు" అని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ అన్నారు. "సౌత్ దివా క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఒక క్యాలెండర్‌‌లో చాలా కల్చర్స్ ఉండటం మంచి పరిణామం. స్టార్ హీరోయిన్స్‌తో ఉన్న ఈ క్యాలెండర్ కలర్‌‌ఫుల్‌గా ఉంది" అని భారతి సిమెంట్స్ ఎండీ రవీందర్ రెడ్డి చెప్పారు.

ఓటీటీ రిలీజ్ మూవీ హైడ్ అండ్ సీక్ హీరోయిన్ రియా సచ్‌దేవ్ మాట్లాడుతూ.. "తెలుగు ప్రేక్షకుల ప్రేమ, సపోర్ట్‌ మర్చిపోలేనిది" అని చెప్పింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ "ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్యాలెండర్‌‌ ద్వారా చాలా మంది న్యూ టాలెంట్ ఇండస్ట్రీకి వస్తారు" అని చెప్పుకొచ్చింది.

తొమ్మిదో ఎడిషన్‌లో

అలాగే, ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్స్ ఐశ్వర్య కృష్ణ, పలక్ అగర్వాల్, కనిక మాన్, అనుశ్రీ, రిచా జోషి, జెస్సీ మాట్లాడుతూ.. "మై సౌత్ దివా క్యాలెండర్ తొమ్మిదవ ఎడిషన్‌లో భాగమవడం చాలా హ్యాపీగా ఉంది" అని అన్నారు.

మై సౌత్ దివా క్యాలెండర్ 2025 లాంచింగ్ ఈవెంట్
మై సౌత్ దివా క్యాలెండర్ 2025 లాంచింగ్ ఈవెంట్
Whats_app_banner

సంబంధిత కథనం