ChiruAnil: అనిల్‍తో మూవీ గురించి అదిరిపోయే విషయం చెప్పిన చిరంజీవి.. ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని కామెంట్-my movie with anil ravipudi fullfledged comedy entertainer says chiranjeevi at laila event and gives jai janasena slogan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiruanil: అనిల్‍తో మూవీ గురించి అదిరిపోయే విషయం చెప్పిన చిరంజీవి.. ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని కామెంట్

ChiruAnil: అనిల్‍తో మూవీ గురించి అదిరిపోయే విషయం చెప్పిన చిరంజీవి.. ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని కామెంట్

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 09, 2025 10:49 PM IST

ChiruAnil: అనిల్ రావిపూడితో తాను చేయనున్న సినిమా గురించి చిరంజీవి సూపర్ అప్‍డేట్ ఇచ్చారు. అభిమానులు ఎగ్జైట్ అయ్యే విషయం చెప్పారు. లైలా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు.

ChiruAnil: అనిల్ రావిపూడితో మూవీ గురించి అదిరిపోయే విషయం చెప్పిన చిరంజీవి.. మెగాస్టార్ నోట ‘జై జనసేన’ నినాదం
ChiruAnil: అనిల్ రావిపూడితో మూవీ గురించి అదిరిపోయే విషయం చెప్పిన చిరంజీవి.. మెగాస్టార్ నోట ‘జై జనసేన’ నినాదం

మెగాస్టార్ చిరంజీవి తన తర్వాతి మూవీని డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్నారు. ఆయన హీరోగా నటించిన విశ్వంభర ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, చిరూతో మూవీ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ పనులను జోరుగా చేస్తున్నారు అనిల్. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో రీసెంట్‍గా భారీ బ్లాక్‍బస్టర్ కొట్టారు అనిల్ రావిపూడి. దీంతో చిరంజీవితో ఆయన చేసే మూవీ ఎలా ఉంటుందోననే ఆసక్తి విపరీతంగా ఉంది. మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు నేడు (ఫిబ్రవరి 9) చిరంజీవి, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ కాంబోలో రానున్న మూవీ గురించి అదిరిపోయే విషయాలు చెప్పారు చిరూ.

ఫుల్‍ఫ్లెడ్జ్ కామెడీతో..

అనిల్ రావిపూడితో తాను చేసే చిత్రం ఫుల్‍ఫ్లెడ్జ్ కామెడీతో ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత తాను కామెడీ ఎంటర్‌టైనర్ చేస్తున్నానంటూ సూపర్ అప్‍డేట్ ఇచ్చేశారు. లైలా ప్రీ-రిలీజ్ వేదికగా ఈ విషయాలను పంచుకున్నారు. అనిల్‍తో తాను మూవీ చేస్తున్నానని చిరూ కన్పర్మ్ చేశారు. ఇది లీక్ కాదు కదా అని అనిల్‍ను సరదాగా చిరంజీవి అడిగారు. మెగా అనౌన్స్‌మెంట్ అని అనిల్ చెప్పారు.

సమ్మర్‌లో షూటింగ్ షురూ

చిరంజీవికి ఇది 157వ చిత్రంగా ఉండనుంది. దీని ప్రాజెక్ట్ పేరు చిరూఅనిల్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సమ్మర్‌లో మొదలవుతుందని చిరంజీవి చెప్పేశారు. “రిలీజ్ ఎప్పుడు అనేది నేను వేరే విధంగా లీక్ ఇస్తాను. కానీ మాత్రం సమ్మర్‌లో ప్రారంభం రానుంది. ఇది ఆద్యంతం చాలా కామెడీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ చేస్తున్నా. ఎప్పుడు షూటింగ్‍లో పాల్గొంటానా అనే ఉత్సాహం ఉంది. అనిల్ సీన్స్ చెబుతున్నప్పుడు అతడు పగబడి నవ్వుతున్నాడు. నేను కూడా కడుపు పట్టుకొని నవ్వుతున్నా. అంత బాగా ఉంది” అని చిరంజీవి అన్నారు.

డైరెక్టర్ కోదండరామి రెడ్డితో తనకు ఎలాంటి కెమెస్ట్రీ ఉండేదో అనిల్‍ రావిపూడితో అలా అనిపిస్తోందని చిరంజీవి చెప్పారు. ఆ సినిమాకు ఇది చాలా ఉపయోగపడుతుందని, తామిద్దరం కథను ప్రేమించి చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నానని చెప్పారు. సాహు గారపాటితో పాటు తన కూతురు సుష్మిత కూడా ఈ మూవీ నిర్మాతల్లో ఉంటారని చిరూ కన్ఫర్మ్ చేశారు.

జై జనసేన అంటూ..

తన తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నినాదాన్ని పలికారు చిరంజీవి. ‘జై జనసేన’ అని అన్నారు. తాను గతంలో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా రూపాంతరం చెందిందని, చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు.

బుగ్గ కొరికేయాలనిపించేలా..

హీరోలు లేడీ గెటప్‍లు వేసిన చిత్రాలు చాలా సూపర్ హిట్స్ అయ్యాయని చిరంజీవి చెప్పారు. లైలా చిత్రం కూడా తప్పకుండా హిట్ అవుతుందని అన్నారు. మొరటుగా, మాస్‍గా ఉండే విశ్వక్‍సేన్ నాజుగ్గా బుగ్గ కొరికేయాలనిపించేలా తయారయ్యాడని చిరూ ప్రశంసించారు.

లైలా సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విశ్వక్ లేడీ గెటప్ కూడా వేశారు. ఈ చిత్రానికి రామ్‍నారాయణ్ దర్శకత్వం వహించారు. విశ్వక్‍కు జోడీగా ఆకాంక్ష హీరోయిన్‍గా చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం