ఓటీటీలోకి న్యూ తెలుగు కామెడీ మూవీ.. కోరిక తీరకుంటే దెయ్యాలవుతరా.. ఎన్నో అవార్డ్స్, 9 రేటింగ్.. ఇక్కడ చూసేయండి!-muthayya ott streaming on etv win from may 1st award winning telugu comedy movie muthayya ott release date announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి న్యూ తెలుగు కామెడీ మూవీ.. కోరిక తీరకుంటే దెయ్యాలవుతరా.. ఎన్నో అవార్డ్స్, 9 రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి న్యూ తెలుగు కామెడీ మూవీ.. కోరిక తీరకుంటే దెయ్యాలవుతరా.. ఎన్నో అవార్డ్స్, 9 రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి న్యూ తెలుగు కామెడీ మూవీ ముత్తయ్య స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. తాజాగా ముత్తయ్య ఓటీటీ రిలీజ్ డేట్‌ను సదరు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 9 రేటింగ్ సంపాదించుకున్న ముత్తయ్య ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేద్దాం.

ఓటీటీలోకి న్యూ తెలుగు కామెడీ మూవీ.. కోరిక తీరకుంటే దెయ్యాలవుతరా.. ఎన్నో అవార్డ్స్, 9 రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్, జోనర్‌తో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. దాదాపుగా రోజుకోటి చొప్పున ఓటీటీ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలాగే, ఓటీటీ స్ట్రీమింగ్ అనౌన్స్‌మెంట్స్ కూడా వస్తూనే ఉంటాయి.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో

తాజాగా న్యూ తెలుగు కామెడీ మూవీ ఓటీటీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆ సినిమానే ముత్తయ్య. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి, అవార్డులు సైతం అందుకున్న ముత్తయ్య ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 2022లో తెరకెక్కిన కామెడీ డ్రామా సినిమానే ముత్తయ్య.

బలగం ఫేమ సుధాకర్ రెడ్డి

ముత్తయ్య మూవీకి డైరెక్టర్ భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. ముత్తయ్యలో బలగం ఫేమ్ కె సుధాకర్ రెడ్డి టైటిల్ రోల్ పోషించారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ బ్యానర్స్‌పై ముత్తయ్య సినిమాను వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.

వెంటపెట్టుకుని తిరగొద్దు

70 ఏళ్ల వయసులో సినిమాల్లో నటించాలని పరితపించే వృద్ధుడి కథగా ముత్తయ్య ఉండనుంది. "కోరిక తీరకుంటే దెయ్యాలవుతారట కదా", "కోరికలు ఉంటే వెంటనే తీర్చుకోవాలి లేదా అక్కడే బొందపెట్టి రావాలిరా నాలెక్క యెంబడి పెట్టుకుని తిరగొద్దురా" అని చెప్పే డైలాగ్స్ ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతాయి.

ముత్తయ్య అవార్డ్స్

ఇలా ఎమోషనల్‌గా కామెడీ డ్రామాగా వచ్చిన ముత్తయ్య లండన్‌లోని యుకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శితమైంది. 28వ కోల్ కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ లాంగ్వేజెస్ కేటగిరీలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, దుబాయ్‌లోని మెటా ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, ఇండిక్ చిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ అవార్డులను ముత్తయ్య గెలుచుకుంది.

ముత్తయ్య ఓటీటీ రిలీజ్

అంతేకాకుండా ఇంకా చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ముత్తయ్య సినిమాను ప్రదర్శించారు. ఇక సినిమాలకు రేటింగ్ ఇచ్చే ఐఎమ్‌డీబీ ముత్తయ్య మూవీకి 10కి ఏకంగా 9 పాయింట్లతో రేటింగ్ ఇచ్చింది. ఇలాంటి ముత్తయ్య ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈటీవీ విన్‌లో ముత్తయ్య ఓటీటీ రిలీజ్ అవనుంది.

మే 1 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్

మే 1 నుంచి తెలుగులో ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లో ముత్తయ్య ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈటీవీ విన్ ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. మరి ఓటీటీలో ముత్తయ్య ఎలాంటి రెస్పాన్స్ సంపాదిస్తుందో వేచి చూడాలి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం