డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ 7 సినిమాలను మిస్ కావొద్దు! ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..-must watch these vetrimaran films on otts vada chennai vasaranai to vidudtalai ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ 7 సినిమాలను మిస్ కావొద్దు! ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..

డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ 7 సినిమాలను మిస్ కావొద్దు! ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..

డైరెక్టర్ వెట్రిమారన్.. సినిమాలను సామాజిక అంశాలు, సమస్యల ఆధారంగా తెరకెక్కించారు. ఆయన చిత్రాలు చాలా ప్రశంసలు దక్కించుకున్నాయి. వెట్రిమారన్ తీసిన కొన్ని సినిమాలు అసలు మిస్ కాకూడదు. అలాంటి 7 చిత్రాల గురించి ఇక్కడ చూడండి.

డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ 7 సినిమాలను మిస్ కావొద్దు! ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..

తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ కొన్ని హార్డ్ హిట్టింగ్ సినిమాలను రూపొందించారు. తన చిత్రాల్లో సామాజిక సమస్యలు, అసమానతలు, అన్యాయలను ఆయన ఎక్కువగా ప్రస్తావించారు. మనసులను బలంగా తాకేలా, ఆలోచనలను రేపేలాంటి సినిమాలు తీశారు. చాలా సినిమాలకు ప్రశంసలు, అవార్డులు దక్కాయి. వెట్రిమారన్ తెరకెక్కించిన కొన్ని చిత్రాలను తప్పనిసరిగా చూడాలి. అలాంటి ఏడు సినిమాలో ఏవో.. ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

అసురన్

వెట్రిమారన్ తెరకెక్కించిన అసురన్ మూవీ ఓ క్లాసిక్‍గా నిలిచిపోయింది. ఈ మూవీలో ధనుష్ లీడ్ రోల్ చేశారు. 2019లో వచ్చిన ఈ చిత్రం ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‍గానూ హిట్ అయింది. ధనుష్‍కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది. హార్డ్ హిట్టింగ్ స్టోరీతో ఈ రివేంజ్ యాక్షన్ మూవీని వెట్రిమారన్ తెరకెక్కించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

వడా చెన్నై

ధనుష్ హీరోగా 2018లో వడా చెన్నై చిత్రం వచ్చింది. రెండు గ్రూప్‍ల మధ్య గొడవల్లో క్యారమ్ ప్లేయర్ అన్బు చిక్కుకోవడం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ధనుష్‍తో పాటు ఆండ్రియా జెమీమా, అమీర్, సుముద్రఖని కీలకపాత్రలు పోషించారు. వెట్రిమారన్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రం కూడా తప్పక చూడాల్సిందే. వడా చెన్నై మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

విసారనై

విసారనై చిత్రం కూడా ఆలోచింపజేలా ఉంటుంది. చేయని నేరానికి నలుగురు యువకులు పోలీసుల కస్టడీలో చిత్ర హింసలు అనుభవించడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ సినిమాలో దినేశ్, ఆనంది, సముద్రఖని, ఆడుకాలం మురగదాస్, కిశోర్ లీడ్ రోల్స్ చేశారు. విసారనై సినిమాను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.

ఆడుకాలం

వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఆడుకాలం చిత్రానికి . ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్‍ప్లే సహా మొత్తంగా ఆరు జాతీయ అవార్డులు దక్కాయి. 2010లో వచ్చిన ఈ చిత్రంలో ధనుష్, తాప్సీ, కిశోర్, జయపాలన్ ప్రధాన పాత్రలు పోషించారు. మధురైలో కోడిపందాలు, గొడవలతో ఈ చిత్రం ఉంటుంది. ఆడుకాలం సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

విడుదలై పార్ట్ 1

సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించిన విడుదలై పార్ట్ 1 చిత్రం 2023లో విడుదలైంది. ఈ మూవీని కూడా రస్టిక్‍గా క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఓ అతివాద గ్రూప్ నాయకుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించే ఓ కానిస్టేబుల్, ఈ క్రమంలో జరిగే సంఘర్షణతో ఈ మూవీ ఉంటుంది. విడుదలై పార్ట్ 1 చిత్రం జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంది.

విడుదలై పార్ట్ 2

మొదటి భాగానికి కొనసాగింపుగా 2024లో విడుదలై పార్ట్ 2 సినిమా విడుదలైంది. తన సిద్ధాంతానికి అనుగుణంగానే ఈ మూవీని వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోనూ విజయ్ సేతుపతి, సూరితో పాటు మంజు వారియర్, భవానీ శ్రీ, గౌతమ్ మీనన్ ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. విడుదలై పార్ట్ 2 మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడొచ్చు.

పొల్లధవన్

ధనుష్ హీరోగా 2007లో పొల్లధవన్ చిత్రం వచ్చింది. ఈ మూవీని యాక్షన్ థ్రిల్లర్‌గా డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించారు. తన బైక్ దొంగతనానికి గురయ్యాక ఓ యువకుడి జీవితం ఎలా తిలకిందులు అయిందనేది ఈ మూవీలోని కథాంశం. పొల్లధవన్ చిత్రం సన్‍నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం