OTT Thrillers: ఓటీటీల్లో ఈ 3 మలయాళ థ్రిల్లర్ చిత్రాలను అసలు మిస్ అవ్వొద్దు!-must watch these malayalam thriller films rekhachithram ponman and officer on duty on otts sony liv netflix hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thrillers: ఓటీటీల్లో ఈ 3 మలయాళ థ్రిల్లర్ చిత్రాలను అసలు మిస్ అవ్వొద్దు!

OTT Thrillers: ఓటీటీల్లో ఈ 3 మలయాళ థ్రిల్లర్ చిత్రాలను అసలు మిస్ అవ్వొద్దు!

OTT Malayalam Thriller: మలయాళ థ్రిల్లర్లకు ఓటీటీల్లో మంచి ఆదరణ ఉంటుంది. రీసెంట్‍గా ఓటీటీల్లో కొన్ని చిత్రాలు అడుగుపెట్టాయి. ఓటీటీల్లో తప్పనిసరిగా చూడాల్సిన 3 మలయాళ థ్రిల్లర్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.

OTT Malayalam Thrillers: ఓటీటీల్లో ఈ 3 మలయాళ థ్రిల్లర్ చిత్రాలను అసలు మిస్ అవ్వొద్దు!

మలయాళ థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. కొత్త థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలాంటి వారు ఓటీటీల్లో మూడు రీసెంట్ మలయాళ చిత్రాలను అసలు మిస్ కాకూడదు. రెండు ఇప్పటికే స్ట్రీమింగ్‍కు రాగా.. మరొకటి ఈ వారం అడుగుపెట్టనుంది. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారు ఈ మూడు సినిమాలను తప్పనిసరిగా చూడాలి. ఏవంటే..

రేఖాచిత్రం.. 40 ఏళ్ల కిందటి మర్డర్ మిస్టరీ

రేఖాచిత్రం సినిమా గ్రిప్పింగ్‍గా మంచి థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ అమ్మాయి మర్డర్ గురించి ఓ పోలీస్ చేసే దర్యాప్తు చుట్టూ ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సాగుతుంది. చిత్రమంతా ఎంగేజింగ్‍గా సాగుతోంది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించిన రేఖాచిత్రం మూవీకి జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు. జనవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్‍బస్టర్ కొట్టింది.

రేఖాచిత్రం మూవీ సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. మార్చి 6న స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో గత వారమే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల నచ్చే వారు రేఖాచిత్రం మూవీని అసలు మిస్ కాకూడదు.

పొన్‍మ్యాన్.. నగల రికవరీ కోసం..

పొన్‍మ్యాన్ చిత్రం కామెడీ థ్రిల్లర్ మూవీగా వచ్చింది. పెళ్లి కోసం ఓ అమ్మాయికి ఓ గోల్డ్ సేల్స్ ఏజెంట్ నగలు ఇవ్వగా.. అందుకు వారి కుటుంబం తగిన డబ్బు ఇవ్వదు. ఆ నగలను రికవరీ చేసుకునేందుకు ఆ ఏజెంట్ చేసే ప్రయత్నాలు, ఎదురయ్యే సవాళ్ల చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్, సాజిన్ గోపు, లిజోమోల్ జోస్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ జోతిష్ శంకర్ తెరకెక్కించారు.

పొన్‍మ్యాన్ చిత్రం గత వారమే జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. జనవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మంచి హిట్ అయింది. డార్క్ కామెడీతో ఉండే ఈ థ్రిల్లర్ మూవీ మెప్పిస్తుంది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ.. ట్విస్టులతో సాగే కేసు

గోల్డ్ చైన్ దొంగతనం, ఓ అమ్మాయి అనుమాస్పద మరణం, పోలీస్ ఆత్మహత్య లాంటి ట్విస్టులతో ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ సాగుతుంది. ఈ కేసును ఓ పోలీస్ దర్యాప్తు చేయడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీలో కుంచకో బోబన్ ప్రధాన పాత్ర పోషించగా.. జితూ అష్రాఫ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. మార్చి 14న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం మరో మూడు రోజుల్లో అంటే మార్చి 20వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే వారికి ఇది పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం