Crime Thrillers Netflix OTT: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తప్పక చూడాల్సిన 5 తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు-must watch tamil crime thriller movies on netflix ott maharaja to psycho ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Crime Thrillers Netflix Ott: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తప్పక చూడాల్సిన 5 తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు

Crime Thrillers Netflix OTT: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తప్పక చూడాల్సిన 5 తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు

Netflix OTT 5 Tamil Crime Thrillers: తమిళంలో చాలా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టాయి. ఆ ఓటీటీలో తప్పకచూడాల్సిన ఐదు థ్రిల్లర్ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.

Netflix OTT 5 Tamil Crime Thrillers: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తప్పక చూడాల్సిన 5 తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు

తమిళ ఇండస్ట్రీలో చాలా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు వచ్చాయి. కొన్ని సినిమాలు బ్లాక్‍బస్టర్ సాధించాయి. డిఫరెంట్ స్టోరీలతో కొన్ని సినిమాలు తెరకెక్కాయి. కొన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఉన్నాయి. వాటిలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తప్పక చూడాల్సిన ఐదు తమిళ క్రైమ్ థ్రిల్లర్ గురించి ఇక్కడ చూడండి.

విసారనై

వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం విసారనై తెరకెక్కింది. 2016లో రిలీజైన ఈ సినిమా ప్రశంసలను దక్కించుకోవటంతో పాటు కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. ఈ మూవీలో అట్టకత్తి దినేశ్, సముద్రఖని, మురగదాస్, కిశోర్, రామదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. చేయని దొంగతనానికి నలుగురు యువకులు పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడం, ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితుల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. విసారనై సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. ఈ మూవీ తప్పక చూడాల్సిన థ్రిల్లర్.

సైకో

ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రలో సైకో చిత్రం 2020లో వచ్చింది. ఈ మూవీలో నిత్య మీనన్, అదితి రావు హైదరీ కూడా లీడ్ రోల్స్ చేశారు. మిస్కిన్ దర్శకత్వం వహించారు. సైకో సీరియల్ కిల్లర్ నుంచి తన ప్రేయసిని రక్షించుకునేందుకు కళ్లు కనిపించని ఓ వ్యక్తి చేసే ప్రయత్నం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. సైకో చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు. థ్రిల్లర్ సినిమాకు నచ్చే వారిని ఈ మూవీ మెప్పిస్తుంది.

మహారాజా

విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన మహారాజా చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. గతేడాది 2024లో వచ్చిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా రూ.150కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. నిథిలన్ సామినాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మహారాజా కూడా మిస్ కాకుండా చూడాల్సిన థ్రిల్లర్ చిత్రం. స్క్రీన్‍ప్లే గ్రిప్పింగ్‍గా ఉంటూ ఉత్కంఠభరితంగా ఈ మూవీ ఉంటుంది. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.

సొర్గవాసల్

ఆర్జే బాలాజీ హీరోగా నటించిన సొర్గవాసల్ గతేడాది నవంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ విశ్వనాథన్ దర్శకత్వం వహించారు. చేయని నేరానికి జైలు పాలైన వ్యక్తి చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రం సాగుతుంది. గ్రిప్పింగ్‍గా ఉండే ఈ సొర్గవాసల్ మూవీని మిస్ అయి ఉంటే వీక్షించొచ్చు.

కొలాయుథిల్ కాలమ్

నయనతార, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో కొలాయుథిల్ కాలమ్ (2019) మూవీ వచ్చింది. ఇంటి వరకు వచ్చిన కిల్లర్ నుంచి తన ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ బధిర మహిళ చేసే పోరాటం చుట్టూ ఈ చిత్రం ఉంటుంది. ఈ మూవీకి చక్రీ తోలేటి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు నచ్చే వారిని కొలాయుథిల్ కాలమ్ ఆకట్టుకుంటుంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం