Ram Ram Eeswaram: హిప్నటైజ్ చేసేలా రం రం ఈశ్వరం సాంగ్.. శివం భజే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్
Shivam Bhaje Ram Ram Eeswaram Song Release: అశ్విన్న బాబు హీరోగా దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ శివం భజే మూవీ. ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ రం రం ఈశ్వరం పాటను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విడుదల చేశారు.

Ram Ram Eeswaram From Shivam Bhaje: అశ్విన్ బాబు హీరోగా నటించిన మరో కొత్త సినిమా శివం భజే. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'రం రం ఈశ్వరం' అని మొదలయ్యే ఈ శివ స్తుతి పాట లిరికల్ వీడియోని సెన్సేషనల్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసారు.
"రం రం ఈశ్వరం
హం పరమేశ్వరం
యం యం కింకరం
వం గంగాధరం"
అంటూ సాగే శివ స్తుతికి తగ్గట్టుగా ఉన్న ఈ పాట హిప్నటైజ్ చేసేలా మ్యూజిక్ సెట్ అయిందని మేకర్స్ చెప్పారు. దీంతో ఈ పాట విడుదలైన కొంత సేపటికే అన్ని చోట్ల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివిధ వయసులు, ప్రాంతాలు, మతాల వారు కూడా ఈ పాట వింటుంటే శివ ధ్యానంలోకి జారినట్టుగా అనిపించడం, భక్తి తన్మయత్వంలో గూస్ బంప్స్ వస్తున్నాయని చెబుతుండటంతో నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి చాలా సంతోషంగా ఉన్నారు.
వికాస్ బడిస ట్యూన్ చేసిన ఈ పాటకి రచయిత పూర్ణాచారి సాహిత్యం అందించగా, సాయి చరణ్ పాడారు. కథలో కీలకమైన ఘట్టంలో రానున్న ఈ పాటకి తగ్గట్టుగా కట్టిపడేసే విజువల్స్ ఉంటాయని నిర్మాత తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పలు విశేషాలు చెప్పారు.
"చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు ఆఖరి దశలో ఉన్న మా 'శివం భజే' చిత్రం ఆగస్టు 1న బ్రహ్మాండమైన విడుదలకి సిద్ధమవుతుంది. తాజాగా, ప్రమోషన్స్‌లో భాగంగా మొదటి పాట రం రం ఈశ్వరంని సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు విడుదల చేశారు. శివ స్తుతితో సాగే ఈ పాట విడుదలైన కొంతసేపటికే అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది" అని నిర్మాత మహేశ్వర్ రెడ్డి అన్నారు.
"పాట వింటూ ఉంటే తెలీకుండా శివ ధ్యానంలోకి వెళుతున్నట్టుగా తన్మయత్వంతో వింటున్నామని కొందరు చెప్పడం చాలా సంతోషంగా అనిపించించింది. మా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస నేపథ్య గీతం, పాటలు ఈ చిత్రానికి చాలా బలమవుతాయి. పాటకి తగ్గట్టుగా సినిమాటోగ్రాఫర్ శివేంద్ర దాశరథి విజువల్స్ కూడా అదే స్థాయిలో మిమ్మల్ని ఆకట్టుకుంటాయి" అని నిర్మాత తెలిపారు.
"వైవిధ్యమైన కథతో పాటు ఇండస్ట్రీ అగ్ర నిపుణులు, ఉన్నతమైన సాంకేతిక విలువలతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించాం. హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అప్సర్, ఇతర నటీ నటులు కూడా ఈ చిత్ర విజయంపై చాలా నమ్మకంతో ఉన్నారు" అని శివం భజే నిర్మాత చెప్పుకొచ్చారు.
"శివస్మరణతో మొదలైన మా చిత్రానికి ఆయన ఆశీస్సులతో ప్రతీ అప్డేట్‌కి అద్భుత స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ట్రైలర్ విడుదల గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని నిర్మాత మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాగా ఇందులో హీరోయిన్‌గా దిగంగనా సూర్యవంశీ యాక్ట్ చేసింది.