GV Prakash Kumar Kingston Telugu Trailer Released: అటు మ్యూజికి డైరెక్టర్‌గా ఇటు హీరోగా సత్తా చాటుతున్నాడు జీవీ ప్రకాష్ కుమార్. బ్యాచ్‌లర్ వంటి రొమాంటిక్ సినిమాతో అలరించిన జీవీ ప్రకాష్ కుమార్ ఇప్పుడు హారర్ సీ అడ్వెంచర్ ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా కింగ్స్‌స్టన్. భారతీయ తొలి సీ అడ్వెంచర్ ఫాంటసీ సినిమాగా కింగ్‌స్టన్ తెరకెక్కింది. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జి స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. ఈ చిత్రాన్ని జీవీ ప్రకాష్ కుమార్ స్వయంగా నిర్మించడం విశేషం. కింగ్‌స్టన్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో మార్చి 7న కింగ్‌స్టన్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కింగ్‌స్టన్ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా గ్రిప్పింగ్‌గా ఉంది. హారర్, ఎమోషనల్, అడ్వెంచర్, లవ్ స్టోరీ అంశాలతో కింగ్‌స్టన్ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తె తెలుస్తోంది.
"అనగనగా ఓ ఊరు.. అది సముద్ర తీరంలో ఉంది. ఆ ఊరిలో ఏదో ఉందని, ఇంకేదో జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. 'ఒకడి అత్యాశ ఈ ఊరిని నాశనం చేసింది. మళ్లీ నువ్వు ఆ తప్పు చేయకు' అనే డైలాగ్స్‌తో సినిమాపై ఇంటెన్స్ క్రియేట్ చేశారు. సముద్రంలోకి హీరో ఎందుకు వెళ్లాడు? అనేది ఆసక్తిగా మారింది.
సముద్రం మధ్యలో 'ఒడ్డున ఎవరి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరి కోసం చావాలి' అని హీరో చెప్పే డైలాగ్ బాగుంది. సముద్రంలోకి హీరో వెళ్లినప్పుడు అతని దగ్గరకు వచ్చిన దెయ్యాలు భయపెట్టేలా ఉన్నాయి. వాటితో చేసే యాక్షన్ ఎపిసోడ్ అలరించేలా ఉంది. సముద్రంలో సాహసాలను, దెయ్యాలను, ఫాంటసీనీ కలగలిపి ఒక రకమైన ఉద్వేగాన్ని కలిగించే విధంగా ఈ సినిమా ఉంటుందనే భావాన్ని ఈ ట్రైలర్ కలిగిస్తుంది.
ఇకపోతే కింగ్‌స్టన్ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్ సరసన దివ్యభారతి హీరోయిన్‌గా చేసింది. వీళ్లిద్దరు ఇదివరకు రొమాంటిక్ మూవీ బ్యాచ్‌లర్‌లో జోడీ కట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ పెయిర్ ఆన్‌స్క్రీన్‌పై కనువిందు చేయనుంది. ఈ ఇద్దరితోపాటు కింగ్‌స్టన్ సినిమాలో చేతన్, అళగన్ పెరుమాళ్, ఎలాంగో కుమార్ వేల్, రాజేష్ బాలాచంద్రన్, అరుణాచలేశ్వరన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
కాగా కింగ్‌స్టన్ సినిమాకు కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించగా.. జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ భన్సాల్ నిర్మాతలుగా వ్యవహరించారు. సంగీతం జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే మార్చి 7 వరకు ఆగాల్సిందే.
సంబంధిత కథనం