GV Prakash Kumar About Kingston Movie And Franchise: తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా 'కింగ్‌స్టన్'. జి స్టూడియోస్ సంస్థతో కలిసి ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ పతాకం మీద జీవీ ప్రకాష్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. నిర్మాతగా జీవీ ప్రకాష్ కుమార్ తొలి చిత్రమిది.
గంగా ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి కింగ్‌స్టన్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారం మార్చి 7వ తేదీన కింగ్‌స్టన్ విడుదల కానుంది. ఈ సందర్భంగా జీవీ ప్రకాష్ కుమార్ హైదరాబాద్ వచ్చారు. తెలుగు మీడియాతో ఆయన ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు జీవీ ప్రకాష్ కుమార్.
థాంక్యూ అండి. కింగ్‌స్టన్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ రావడం నాకు సంతోషంగా ఉంది.
సాధారణంగా ప్రతి సినిమా విడుదలకు ముందు ఉంటుంది. 'ఓహ్.. ఇంకా విడుదలకు నాలుగు రోజులే ఉంది. విడుదలకు మూడు రోజులే ఉంది' అని అనిపిస్తూ ఉంటుంది.
ప్రొడక్షన్ చేయాలని కొన్ని రోజులుగా అనుకుంటున్నాను. కింగ్‌స్టన్ కథ విన్న తర్వాత నచ్చింది. జి స్టూడియోస్ సంస్థతో కలిసి చేశా. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఇటువంటి సినిమా రాలేదు. 'కింగ్‌స్టన్'ను ఫ్రాంచైజీలా చేయాలని అనుకుంటున్నాం. మా దగ్గర నాలుగు పార్టుల వరకు కథ రెడీగా ఉంది.
సముద్ర తీరం పక్కన ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో జాలరి పాత్ర చేశాను. సాధారణంగా జాలర్లు అందరూ సముద్రంలో వేటాడడానికి వెళతారు. అయితే ఆ ఊరి ప్రజలు ఎవరూ సముద్రంలోకి వెళ్లరు. ఆ ఊరికి ఒక శాపం ఉంటుంది. అది ఏమిటి? అనేది సినిమాలో చూడాలి.
శాపాన్ని ఎదిరించాలని హీరో సముద్రంలోకి వెళ్తాడు. అక్కడ ఏం జరిగిందనేది సినిమా. ఇండియాలో ఫస్ట్ సీ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా ఇది. సముద్రంలోకి వెళ్లిన తర్వాత హీరోలకు జాంబీలో ఎదురవుతాయి. అలాగే ఆత్మలు కూడా ఉంటాయి. ప్రేక్షకులకు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
నాలుగు రోజుల పాటు అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఒకసారి నీటిలోకి వెళ్లిన తర్వాత మూడు నిమిషాలు పైకి రావడానికి ఉండదు. శ్వాసను ఎలా ఆపాలి? అనే దాంతో పాటు యాక్షన్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. ఒకసారి నీటిలో ఉన్నప్పుడు వన్ మోర్ టేక్ అనేవారు. అప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉండేది.
సంబంధిత కథనం