Viraaji: ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో సరికొత్త మూవీ.. ఆ ఒక్కదానికే 45 రోజుల వర్క్-music director ebenezer paul about varun sandesh viraaji bgm work in title launch event viraaji title announcement ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Viraaji: ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో సరికొత్త మూవీ.. ఆ ఒక్కదానికే 45 రోజుల వర్క్

Viraaji: ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో సరికొత్త మూవీ.. ఆ ఒక్కదానికే 45 రోజుల వర్క్

Sanjiv Kumar HT Telugu
Jul 03, 2024 03:47 PM IST

Varun Sandesh Viraaji Movie BGM Work Time: వరుణ్ సందేశ్ నటిస్తున్న సరికొత్త మూవీ విరాజి. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో ఆ ఒక్కదానికోసమే ఏకంగా 45 రోజులు పని చేసినట్లు మ్యూజిక్ డైరెక్టర్ ఎబినెజర్ పాల్ తెలిపారు. విరాజి టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో ఈ విషయం చెప్పారు.

ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో సరికొత్త మూవీ.. ఆ ఒక్కదానికే 45 రోజుల వర్క్
ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో సరికొత్త మూవీ.. ఆ ఒక్కదానికే 45 రోజుల వర్క్

Varun Sandesh Viraaji Title Announcement: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తదితరులు నటిస్తున్న లేటెస్ట్ సినిమా విరాజి. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను ఆద్యంత్ హర్ష అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.

మంగళవారం (జూలై 2) హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో విరాజి టైటిల్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నటి ప్రమోదిని మాట్లాడుతూ.. "విరాజి ఎంత మంచి పేరో సినిమా కూడా అంతే బాగుంటుంది. ఈ చిత్రంలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశాను. సినిమా కంప్లీట్ అయ్యింది. ప్రొడ్యూసర్ గారు చెప్పినట్లు ప్రమోషన్ చేసి గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. విరాజిని ప్రేక్షకుల దగ్గరకు చేర్చడంలో మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.

"మా మూవీకి డైరెక్టర్ హర్ష విరాజి అనే మంచి తెలుగు టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో నేను నటించాలని పట్టుబట్టి మరీ తీసుకొచ్చాడు హర్ష. ఉదయం 6 గంటల నుంచి అతని ఫోన్స్ మొదలయ్యేవి. ఈ సినిమాలో నటించడం వల్ల సహ నటీనటుల రూపంలో నాకు మంచి మిత్రులు దొరికారు. నా ప్రపంచంలోకి వారు వచ్చారు. వరుణ్ సందేశ్‌తో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. విరాజి ఎంత బాగుంటుంది అనేది మీరు ఆగస్టు 2న థియేటర్స్‌లో చూస్తారు" అని యాక్టర్ రఘు కారుమంచి తెలిపారు.

"నేను యాంగర్ టేల్స్ అనే మూవీ చేశాను. విరాజి నాకు రెండో సినిమా. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు హర్ష, నిర్మాత మహేంద్ర గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఇంటర్‌లో ఉన్నప్పుడు వరుణ్ గారి హ్యాపీ డేస్ సినిమా చూసి ఆ సినిమా ఇచ్చిన ఇన్సిపిరేషన్‌తో డిగ్రీ కంప్లీట్ చేశా. విరాజి మా అందరికీ చాలా మంచి మూవీ అవుతుంది" అని నటుడు ఫణి చెప్పుకొచ్చాడు.

"విరాజి సినిమా కోసం ప్రొడ్యూసర్ మహేంద్ర, డైరెక్టర్ హర్ష నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ మూవీకి మ్యూజిక్ చేసేందుకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. బీజీఎం కోసం 45 డేస్ వర్క్ చేశాం. సినిమా మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఆగస్టు 2న థియేటర్స్‌లో చూడండి" అని విరాజి మ్యూజిక్ డైరెక్టర్ ఎబినెజర్ పాల్ తెలిపారు.

దర్శకుడు ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ.. "విరాజి దర్శకుడిగా నా మొదటి సినిమా. ఇది మా సినిమా ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్. విరాజి సినిమా కోసం నేను ఇద్దరు వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకరు మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెర గారు. ఆయన కథ విని ప్రొడ్యూసర్ మహేంద్ర గారి దగ్గరకు తీసుకెళ్లారు. మహేంద్ర గారు ఒక ప్రొడ్యూసర్ గానే కాకుండా ఒక టెక్నీషియన్ గా కూడా మా మూవీకి వర్క్ చేశారు. ఆయన ఎంతో సపోర్ట్ చేశారు" అని అన్నారు.

"మరో ఇంపార్టెంట్ వ్యక్తి వరుణ్ సందేశ్. ఆయన ఎంతో చొరవగా విరాజి మూవీ చేశారు. త్వరలో రివీల్ చేసే మా మూవీ ఫస్ట్ లుక్ చూస్తే మీరు తప్పకుండా ఇంప్రెస్ అవుతారు. ఇది వరుణ్ సందేశ్‌కు టైలర్ మేడ్ మూవీ. మా మూవీ కాస్టింగ్ అందరికీ థ్యాంక్స్. అలాగే నాతో ఉండి స్క్రీన్ ప్లే డైలాగ్స్‌లో సపోర్ట్ చేసిన శ్రీకాంత్ వర్మకు థ్యాంక్స్. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అంతా చాలా కష్టపడ్డారు. వారికి కృతజ్ఞతలు చెబుతున్నా" అని డైరెక్టర్ ఆద్యంత్ హర్ష తెలిపారు.

WhatsApp channel