AR Rahman hospitalised: ఆసుపత్రిలో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్.. అప్‍డేట్ వెల్లడించిన సీఎం
AR Rahman hospitalised: మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారు. అస్వస్థతతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయ్యారు.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంగా అనిపించటంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో నేటి (మార్చి 16) ఉదయం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స నిర్వహించింది. ప్రస్తుతం రహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన టీమ్ వెల్లడించింది.
కారణం ఇదే
డీహైడ్రేషన్, మెడ నొప్పి కారణంగా ఏఆర్ రహమన్ ఇబ్బంది పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చేరినట్టు ఆయన టీమ్ చెప్పింది. లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే రహమాన్ ఇబ్బందిగా ఫీలయ్యారని తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉంటున్న ఆయనకు డీహైడ్రేషన్ అయిందని తెలుస్తోంది.
ఛాతినొప్పి కారణంగా ఏఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారని, వైద్యులు ఏంజియోగ్రామ్ నిర్వహించారని ముందుగా రూమర్లు బయటికి వచ్చాయి. అయితే, అది నిజం కాదని, డీహైడ్రేషన్ వల్ల కలిగి ఇబ్బందితోనే ఆయన ఆసుపత్రిలో చేరారని రహమాన్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్
ఏఆర్ రహమాన్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని అధికారికంగా వెల్లడించింది అపోలో ఆసుపత్రి. డీహైడ్రేషన్ సమస్యలో ఆసుపత్రిలో చేరారని వెల్లడించింది. ఆరోగ్య పరీక్షల తర్వాత డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.
స్పందించిన సీఎం స్టాలిన్
ఏఆర్ రహమాన్‍కు అస్వస్థత అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగినట్టు తెలిపారు. హెల్త్ అప్‍డేట్ ఇచ్చారు. “అనారోగ్యం కారణంగా ఏఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారని విన్న వెంటనే ఆయన ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడా. ఆయన బాగానే ఉన్నారని, త్వరలోనే ఇంటికి వెళతారని వారు చెప్పారు. సంతోషం” అని స్టాలిన్ ట్వీట్ చేశారు.
ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన ఛావా మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రామ్‍చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‍లో రూపొందుతున్న మూవీ (RC16)కి ఆయనే సంగీతం అందిస్తున్నారు. మరిన్ని ప్రాజెక్టులు కూడా లైనప్‍లో ఉన్నాయి.
కొంతకాలంగా బ్రిటీష్ మ్యూజిషియన్ ఎడ్ షీరన్‍తో కలిసి లైవ్ పర్ఫార్మెన్సులు చేస్తున్నారు ఏఆర్ రహమాన్ . గత నెల చెన్నైలో జరిగిన కాన్సెర్టులో అలరించారు.
గతేడాది వ్యక్తిగత విషయంతోనూ వార్తల్లో నిలిచారు ఏఆర్ రహమాన్. 29 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత తన భార్య సైరాబానుతో ఆయన విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాధతోనే విడిపోతున్నామని, తమ ప్రైవసీని అందరూ గౌరవించాలని సోషల్ మీడియాలో రహమాన్ కోరారు.
సంబంధిత కథనం
టాపిక్