Murder Mystery Web series: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న తెలుగు మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. మీరు చూశారా?
Murder Mystery Web series: ఓటీటీలో ప్రస్తుతం ఓ తెలుగు మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. జీ5 ఓటీటీలో అత్యధిక స్ట్రీమింగ్ మినట్స్ సొంతం చేసుకున్న తెలుగు వెబ్ సిరీస్ గా నిలిచింది.

Murder Mystery Web series: తెలుగు యువ డైరెక్టర్లలో ఒకరు పవన్ సాదినేని. గతేడాది దయా వెబ్ సిరీస్ తో సంచలనం రేపిన అతడు.. తాజాగా పరువు అనే మరో వెబ్ సిరీస్ తీశాడు. ఈ సిరీస్ ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు ఆ ఓటీటీలో ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
పరువు వెబ్ సిరీస్ రికార్డు
పరువు హత్యల నేపథ్యంలో సాగే వెబ్ సిరీసే ఈ పరువు. ఇందులో నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్యలాంటి వాళ్లు నటించారు. ఈ వెబ్ సిరీస్ తాజాగా జీ5 ఓటీటీలో 150 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకోవడం విశేషం. ఈ ఓటీటీలో ఓ తెలుగు వెబ్ సిరీస్ సాధించిన అత్యధిక స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు ఇదే. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపింది.
"150 మిలియన్ వ్యూయింగ్ మినట్స్. మెగా బ్లాక్‌బస్టర్. మెగాస్టార్ మెచ్చిన పరువు. ఈ పరువు జీ5లో చూడండి" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీలో ఈ విషయాన్ని చెప్పింది. ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ లో నాగబాబు ఓ విలన్ పాత్రలో నటించాడు. మరోవైపు ఈ సిరీస్ డైరెక్టర్ పవన్ సాదినేని ఈ మధ్యే ఓ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. కల్కి 2898 ఏడీ మేకర్స్ దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న సినిమాకు డైరెక్షన్ ఛాన్స్ దక్కింది.
పరువు వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే?
పరువు హత్యలు అన్నది చాలా సెన్సిటివ్ పాయింట్. ఈ కాన్సెప్ట్‌తో గతంలో తెలుగు తెరపై కొన్ని సినిమాలొచ్చాయి. కానీ సిరీస్‌లు అంతగా రాలేదు. పరువు వెబ్‌సిరీస్‌తో ఫస్ట్ టైమ్ ఈ కాన్సెప్ట్‌ను టచ్ చేశారు దర్శకద్వయం సిద్ధార్థ్‌నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి. ఓ పరువు హత్య చుట్టూ జరిగే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
అనుకోకుండా ఓ మర్డర్ చేసి ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే ఓ జంట కథ ఇది. ఈ థ్రిల్లర్ కథలో పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలకు సొసైటీలో ఎదురయ్యే అవమానాలు, కుల వివక్ష లాంటి అంశాలను అంతర్లీనంగా టచ్ చేశారు డైరెక్టర్స్.
అభిమాన హీరో గురించి చందు క్యారెక్టర్ చెప్పే సింపుల్ డైలాగ్‌తో సమాజంలోని కుల వివక్షను అర్థవంతంగా చూపించారు డైరెక్టర్స్. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకొని కొందరు నాయకులు చేసే కుట్రలను ఇంటెన్స్‌గా సిరీస్‌లో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. . మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌ను ఆరంభం నుంచి చివరి వరకు గ్రిప్పింగ్‌గా సాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగబోతుందో అనే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో కలిగించడంలో డైరెక్టర్స్ చాలా వరకు సక్సెస్ అయ్యారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ఓ నాయకుడు ప్రేమ జంటకు అన్యాయం చేసి ప్రజల పాలిట ఎలా విలన్‌గా ఎలా మారాడన్నది కన్వీన్సింగ్‌గా సిరీస్‌లో ప్రజెంట్ చేశారు. పల్లవి, సుధీర్ లను కలిపి రొటీన్‌గా క్లైమాక్స్‌ను ఎండ్ చేస్తున్నట్లు సీన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ చివరలో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ తో సీజన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశారు.