Mukku Avinash: జబర్దస్త్ నుంచి హీరోగా మరో కమెడియన్.. డిఫరెంట్ టైటిల్‍తో ముక్కు అవినాష్ మూవీ
Jabardasth Avinash Pre Wedding Prasad: జబర్దస్త్ ద్వారా మంచి కమెడియన్‌గా పాపులర్ అయ్యాడు ముక్కు అవినాష్. ఇప్పుడు అవినాష్ హీరోగా ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ మూవీ టైటిల్‍ను మేకర్స్ ప్రకటించారు. ఆ విశేషాలు చూస్తే..
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్ల్ హీరోగా మారారు. ఈ షోతో హాస్యం పండించి పాపులర్ అయినా కమెడియన్లు హీరోగా అదృష్టాన్ని పరీక్షించకుంటున్నారు. ఇప్పటికే సుధీర్ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర తదితరులు సినిమాల్లో నటిస్తున్నారు. వేణు అయితే బలగంతో దర్శకుడుగా మంచి సక్సెస్ అందుకున్నాడు. నాతో నేను అనే మూవీతో మరో కమెడిన్ శాంతి కుమార్ కూడా డైరెక్టర్ అయ్యాడు.
ఇప్పుడు ముక్కు అవినాష్ హీరోగా పరిచయం కానున్నాడు. డెక్కన్ డ్రీమ్ వర్క్ బ్యానర్‌పై అభిషేక్ నిర్మాణంలో వస్తున్న ముక్కు అవినాష్ మూవీకి 'ప్రీ వెడ్డింగ్ ప్రసాద్' (Pre Wedding Prasad Movie) అని టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో పాతకాలం హీరో గెటప్పుతో అవినాష్ ఆకట్టుకున్నాడు. సినిమా రచయితగా పనిచేసిన రాకేష్ దుబాసి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
అవినాష్ హీరోగా చేస్తున్న తొలి సినిమా ప్రీ వెడ్డింగ్ ప్రసాద్‍లో సాయి కుమార్, సంగీత, రియాజ్, రూప కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‍ను హైదరాబాద్‍లో ప్రారంభించారు. తనను నమ్మి సినిమా చేస్తున్నందుకు నిర్మాత అభిషేక్‍కు జీవితాంతం రుణపడి ఉంటానని అవినాష్ తెలిపాడు. కామెడీ మూవీగా వస్తున్న ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ అందరినీ ఆకట్టుకుంటాడని డైరెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా సినిమా చిత్రీకరణ పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.