OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు సిరీస్‌లు ఇవే
OTT Releases This Week: డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు సిరీస్‌లు ఏవంటే....
ముఖచిత్రం - ఫిబ్రవరి 2 - ఆహా ఓటీటీ (Aha OTT)
ప్రియా వడ్లమాని, వికాస్ వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ముఖచిత్రం సినిమా ఫిబ్రవరి 2 నుంచి(నేడు) ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తోన్న భర్తపై భార్య ఎలా ప్రతీకారం తీర్చుకుందనే పాయింట్‌తో దర్శకుడు గంగాధర్ ఈ సినిమాను తెరకెక్కించారు. కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్‌రాజ్ ముఖచిత్రం సినిమాకు కథను అందించారు. ఇందులో యంగ్ హీరో విశ్వక్‌సేన్ కీలకమైన అతిథి పాత్రలో నటించారు.
ట్రెండింగ్ వార్తలు
సెంబి (తమిళం) - ఫిబ్రవరి 3 - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
సీనియర్ నటి కోవై సరళ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా సెంబి (Sembi) ఫిబ్రవరి 3న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రీలీజ్ కానుంది. ఈ సినిమాకు ప్రభు సాలమన్ దర్శకత్వం వహించాడు. రోడ్ జర్నీ నేపథ్యంలో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది.
వీకం (మలయాళం) - జీ5 (Zee5 OTT)
జెహనబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ వెబ్‌సిరీస్ - ఫిబ్రవరి 3 - సోని లివ్
జెహనబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ వెబ్‌సిరీస్ సోని లివ్ ఓటీటీలో ఫిబ్రవరి 3న విడుదలకానుంది. బీహార్‌లోని జెహనబాద్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. రిత్విక్ బోవిక్, హర్షిత గౌర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు రాజీవ్ బర్నవల్ దర్శకుడు.
నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) రిలీజ్ కానున్న సినిమాలు సిరీస్‌లు...
ట్రూ స్పిరిట్
ఇన్‌ఫైలెస్
స్టీల్ బాయిల్
మై కింగ్ ఉల్లా
క్లాస్
పమేలా
గుంతర్స్ మిలియన్స్