Mufasa Telugu Trailer: ముఫాసా తెలుగు ట్రైలర్ రిలీజ్ - మహేష్ బాబు వాయిస్ గూస్‌బంప్స్ అంటోన్న ఫ్యాన్స్
Mufasa Telugu Trailer: ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు ట్రైలర్ సోమవారం విడుదలైంది. మహేష్‌బాబు వాయిస్ ఈ ట్రైలర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మహేష్ వాయిస్ గూస్‌బంప్స్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తోన్నారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
Mufasa Telugu Trailer: ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు ట్రైలర్ సోమవారం రిలీజైంది. ఇందులో ముఫాసా పాత్రకు మహేష్‌బాబు డబ్బింగ్ చెప్పారు. తెలుగు ట్రైలర్‌లో మహేష్ వాయిస్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు వాయిస్ గూస్‌బంప్స్ అని కామెంట్స్ చేస్తోన్నాయి. మహేష్ వాయిస్ కోసమైనా సినిమాను థియేటర్లలో చూస్తామంటూ కామెంట్స్ చేస్తోన్నారు.
చిట్టి సింహాల కథ...
నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. పుట్టుకతోనే అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడిన టాకాల కథ ఇది అంటూ కథలోకి వెళ్లారు. ఆ తర్వాత ముఫాసా, టాకాల మధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని చూపించారు. అప్పుడప్పుడు ఈ చల్లని గాలి..నా ఇంటి నుంచి జ్ఞాపకాల్ని గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తుంది అంటూ మహేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.
మనం ఒక్కటిగా పోరాడాలి, నేను ఉండగా నీకు ఏం కాదు టాకా...భయపడకు అంటూ మహేష్ బాబు చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఇందాకా ఏదో అన్నావే అంటూ చివరలో తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు. ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ఇది స్పెషల్...
ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పడంపై మహేష్ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఈ క్లాసిక్‌కు తాను వీరాభిమానినని, ముఫాసాకు డబ్బింగ్ చెప్పడం ఎంతో ఆనందంగా ఉందంటూ ట్వీట్...ఇది నాకు చాలా స్పెషల్ అంటూ పేర్కొన్నాడు.
బ్రహ్మానందం కూడా...
తెలుగులో ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు వెర్షన్‌కు మహేష్‌బాబుతో పాటు బ్రహ్మానందం కూడా డబ్బింగ్ చెప్పాడు. ట్రైలర్‌లో బ్రహ్మానందం వాయిస్ వినిపిస్తోంది. ముఫాషా ది లయన్ కింగ్ హిందీ ట్రైలర్‌కు షారుఖ్‌ఖాన్‌తో పాటు అతడి తనయుడు అబ్రం డబ్బింగ్ చెప్పారు. వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ డిసెంబర్ 20న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.
అడ్వెంచరస్ యాక్షన్ మూవీ...
ప్రస్తుతం మహేష్‌బాబు దిగ్గజ దర్శకుడు రాజమౌళితో ఓ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ చేస్తోన్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజమౌళి మూవీలో మహేష్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం ప్రస్తుతం మహేష్ మేకోవర్ అవుతోన్నాడు. త్వరలోనే మహేష్‌బాబు, రాజమౌళి మూవీ ఆఫీషియల్‌గా లాంఛ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నట్లు తెలిసింది.
సంక్రాంతికి గుంటూరు కారం…
కాగా ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మహేష్ బాబు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు మాస్, యాక్షన్ హంగులతో దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. మహేష్ యాక్టింగ్ బాగున్నా త్రివిక్రమ్ కథలో కొత్తదనం లేదంటూ విమర్శలొచ్చాయి. గుంటూరు కారంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.