Mufasa The Lion King OTT Streaming: నేడే ఓటీటీలోకి బ్లాక్‍బస్టర్ ముఫాసా: తెలుగులోనూ.. స్ట్రీమింగ్ మొదలయ్యే టైమ్ ఇదే..
Mufasa: The Lion King OTT Streaming: ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా నేడే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగులోనూ ఈ హాలీవుడ్ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది. స్ట్రీమింగ్‍కు ఏ టైమ్‍లో రానుందంటే..
‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా బంపర్ హిట్ కొట్టింది. సింహాలతో పాటు అడవిలో జంతువులతో సాగే ఈ హాలీవుడ్ చిత్రం బ్లాక్‍బస్టర్ సాధించింది. గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. అంచనాలను నిలబెట్టుకుంది. ఆరేళ్ల కిందట వచ్చిన అదరగొట్టిన ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్‍గా ముఫాసా వచ్చింది. ఈ ముఫాసా: ది లయన్ కింగ్ ఓటీటీలోకి నేడు రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.
స్ట్రీమింగ్ వివరాలివే.. మధ్యాహ్నం నుంచి..
ముఫాసా: ది లయన్ కింగ్ చిత్రం జియోహాట్‍స్టార్ ఓటీటీలో నేడు (మార్చి 26) స్ట్రీమింగ్‍కు రానుంది. నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు స్ట్రీమింగ్ మొదలుకానుంది. రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమ్ కానుంది.
ముఫాసా సినిమా రెగ్యులర్ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూడగా ఎట్టకేలకు నేడు హాట్‍స్టార్ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో సహా మరిన్ని ప్లాట్‍ఫామ్‍ల్లో రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు రెంట్ లేకుండా పూర్తిస్థాయి స్ట్రీమింగ్‍కు జియోహాట్‍స్టార్ ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది. ఈ ముఫాసా చిత్రం ఓటీటీలో భారీ వ్యూస్ దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
తెలుగులో మహేశ్ బాబు డబ్బింగ్
ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా తెలుగులోనూ థియేటర్లలో మంచి కలెక్షన్లు దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం పెద్ద బలంగా నిలిచింది. ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ అయిన ముఫాసాకు మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇది తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఈ మూవీ కోసం సత్యదేవ్, బ్రహ్మానందం, అలీ కూడా డబ్బింగ్ చెప్పారు.
ముఫాసా: ది లయన్ కింగ్ చిత్రానికి బెర్రీ జెన్కిన్స్ దర్శకత్వం వహించారు. సింహాలకు రారాజుగా ముఫాసా ఎలా ఎదిగాడన్న అంశంతో ఈ లైవ్ మ్యూజికల్ యాక్షన్ చిత్రం రూపొందింది. అనాథగా ఉండే సింహం పిల్ల ముఫాసా.. మహారాజుగా మారే జర్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో వరల్డ్ వైడ్‍గా భారీ సక్సెస్ సాధించింది.
ముఫాసా చిత్రం అద్భుతమైన విజువల్స్, నరేషన్, ఎమోషన్లు, కామెడీతో ప్రేక్షకులను మెప్పించింది. సుమారు దాదాపు 200 మిలియన్ డాలర్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 712 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.6,210 కోట్లు) కలెక్షన్లు సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రానికి వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నిర్మించింది. ఇక ముఫాసా చిత్రాన్ని నేటి (మార్చి 26) మధ్యాహ్నం 12.30 గంటల నుంచి జియోహాట్‍స్టార్ ఓటీటీలో చూడొచ్చు.
సంబంధిత కథనం