Mufasa Collections: కలిసొచ్చిన మహేష్‌బాబు వాయిస్ ఓవర్ - ఫస్ట్ వీక్‌లో 74 కోట్ల కలెక్షన్స్ సాధించిన ముఫాసా
Mufasa Collections: వాల్ట్ డిస్నీ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ఫస్ట్ వీక్‌లో 74 కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు మహేష్‌బాబు వాయిస్ ఓవర్ అందించగా...హిందీ వెర్షన్‌కు షారుఖ్‌ఖాన్ గళం అందించారు. వీరిద్దరి క్రేజ్ ఈ మూవీకి కలిసివచ్చింది.
Mufasa Collections: మహేష్‌బాబు వాయిస్ ఓవర్ అందించిన ముఫాసా ది లయన్ కింగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఫస్ట్ వీక్‌లోనే ఇండియా వైడ్‌గా ఈ మూవీ 74 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ముఫాసా ది లయన్ కింగ్ మూవీకి తెలుగులో మహేష్‌బాబు వాయిస్ ఓవర్ అందించారు. ఆయనతో పాటు బ్రహ్మానందం, సత్యదేవ్, అలీ కూడా ఈ మూవీకి గళాన్ని వినిపించారు.
షారుఖ్‌ఖాన్...
హిందీలో ముఫాసా మూవీకి షారుఖ్‌ఖాన్‌తోపాటు ఆయన తనయులు ఆర్యన్, అబ్రామ్ డబ్బింగ్ చెప్పారు. మహేష్‌బాబు, షారుఖ్‌ఖాన్‌కు ఉన్న క్రేజ్ ముఫాసా మూవీకి ప్లస్సయింది. తెలుగుతో పాటు హిందీలో ఈ మూవీ ఫస్ట్ వీక్‌లో భారీగా వసూళ్లను రాబట్టింది.
యూఐ, విడుదల 2 కంటే ఎక్కువ...
గత వారం రిలీజైన ఉపేంద్ర యూఐ, విజయ్ సేతుపతి విడుదల 2 కంటే ముఫాసా మూవీ ఎక్కువగా కలెక్షన్స్ దక్కించుకోవడం గమనార్హం. యూఐ మూవీ ఫస్ట్ వీక్‌లో 36 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా...విడుదల 2 మూవీకి 31 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి.
ముఫాసా కథ ఇదే...
వరదల కారణంగా ముఫాసా తల్లిదండ్రులకు దూరమవుతుంది. ముఫాసాను టాకా అక్కున చేర్చుకుంటుంది. దూరమైన తన తల్లిదండ్రులను ఎప్పటికైనా కలవాలని ముఫాసా ఆశపడుతుంది. ఓ ఎటాక్‌లో తెల్ల సింహాల యువరాజును ముఫాసా చంపేస్తుంది. ముఫాసాపై పగను పెంచుకున్న తెల్ల సింహాలు రాజు కిరోస్...ముఫాసా రాజ్యంపై దండెత్తుతాడు. కిరోస్ దండయాత్రను ముఫాసా ఎలా ఎదుర్కొంది? తన తల్లిదండ్రులను కలవాలనే ముఫాసా కోరిక తీరిందా? లేదా? అనే పాయింట్‌తో ముఫాసా ది లయన్ కింగ్ రూపొందింది.
వరల్డ్ వైడ్‌గా మిక్స్‌డ్ టాక్...
ఇండియాలో అదరగొడుతోన్న ముఫాసా విదేశాల్లో మాత్రం మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాదాపు 200 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 198 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది.
లయన్ కింగ్‌కు సీక్వెల్...
2019లో వచ్చిన ది లయన్ కింగ్‌కు సీక్వెల్‌గా ముఫాసా మూవీ తెరకెక్కింది. ది లయన్ కింగ్ హాలీవుడ్ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 250 మిలియన్ డాలర్ల వసూళ్లతో రూపొందిన ఈ మూవీ 1657 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ దక్కించుకున్నది.