Dhoni as Animal: యానిమల్ మూవీలో రణ్‌విజయ్‌గా మారిపోయిన ధోనీ.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో.. అదిరిపోయిన యాడ్-ms dhoni becomes ranvijay in animal movie for a bicycle ad sandeep reddy vanga directs ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhoni As Animal: యానిమల్ మూవీలో రణ్‌విజయ్‌గా మారిపోయిన ధోనీ.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో.. అదిరిపోయిన యాడ్

Dhoni as Animal: యానిమల్ మూవీలో రణ్‌విజయ్‌గా మారిపోయిన ధోనీ.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో.. అదిరిపోయిన యాడ్

Hari Prasad S HT Telugu

Dhoni as Animal: ధోనీ యానిమల్ మూవీలో రణ్‌విజయ్ గా మారిపోయిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ మూవీని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే ధోనీని డైరెక్ట్ చేయడం విశేషం. ఇంతకీ ఆ వీడియో ఏంటో చూడండి.

యానిమల్ మూవీలో రణ్‌విజయ్‌గా మారిపోయిన ధోనీ.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో.. అదిరిపోయిన యాడ్

Dhoni as Animal: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని కూడా యానిమల్ మూవీలో రణ్‌విజయ్ సింగ్ లా మార్చేశాడు తన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఓ యాడ్ కోసం ధోనీ ఈ లుక్ లో కనిపించడం విశేషం. ఐపీఎల్ రాబోతున్న సమయంలో మన క్రికెటర్లు వింత వింత యాడ్స్ చేస్తున్నారు. తాజాగా ధోనీ ఇలా కనిపించి ఆశ్చర్యపరిచాడు.

రణ్‌విజయ్‌గా ధోనీ..

ధోనీ ఓ స్టార్ క్రికెటర్ అయినా ఓ మూవీ హీరోకు ఉండాల్సిన లుక్స్ అతని సొంతం. అతనిది మంచి హైట్, పర్సనాలిటీ. అప్పుడప్పుడూ యాడ్స్ రూపంలో తన యాక్టింగ్ టాలెంట్ ను కూడా అతడు బయటపెడుతుంటాడు. తాజాగా మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ధోనీ ఓ సైకిల్ బ్రాండ్ కోసం యాడ్ చేశాడు. ఇందులో అతన్ని తన యానిమల్ మూవీలో రణ్‌విజయ్ గా, అర్జున్ రెడ్డిగా మార్చేశాడు సందీప్.

యానిమల్ మూవీలో రణ్‌విజయ్ కారు దిగి తన అనుచరులతో వస్తున్న సీన్ ను ధోనీ రీక్రియేట్ చేశాడు. చేతిలో సైకిల్ తో అతడు రోడ్డు దాటుతుంటాడు. ఇంతలో కట్ కట్ అంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి ఎంట్రీ ఇస్తాడు. అసలు సీన్ అద్భుతంగా వచ్చింది.. జనాలు సీటీ కొడతారు అంటూ ఓ విజిల్ వేస్తాడు. నాకు వినిపిస్తుంది.. చెవిటోన్ని కాదు అంటూ యానిమల్ లో రణ్‌విజయ్ స్టైల్లో ధోనీ ఓ డైలాగ్ కొడతాడు. అది చూసి ఇప్పుడు కదా నా హీరో రెడీ అయ్యాడు అని సందీప్ అంటాడు.

అర్జున్ రెడ్డి స్టైల్లో..

ఆ తర్వాత ధోనీ సైకిల్ పై స్టైల్ గా వస్తుంటాడు. సైకిల్ దిగి స్లైల్ గా కీ తిప్పుకుంటూ వెళ్తుంటాడు. సీన్ కట్ చేసిన సందీప్.. సూపర్ గా వచ్చిందని అంటాడు. ఓ ఎలక్ట్రిక్ సైకిల్ కు ఇది చాలా ఎక్కువ కాలేదా అని ధోనీ అతన్ని అడుగుతాడు. నెక్ట్స్ సీన్లో ఏం జరుగుతుందో చూడండి అంటూ సందీప్ వెళ్లిపోతాడు.

చివరిగా సైకిల్ బ్యాక్‌డ్రాప్ లో ధోనీ మెల్లగా తన ఒరిజినల్ లుక్ లో కనిపిస్తాడు. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ స్టైల్లో తన చేతిని సైకిల్ వైపు చూపిస్తూ సైగ చేస్తాడు. ఈ యాడ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ధోనీ స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఎమ్మెస్ ధోనీ ఐపీఎల్ 2025 కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. బహుశా అతనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చని భావిస్తున్నారు. ఈ మెగా లీగ్ వచ్చే శనివారం (మార్చి 22) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో కేకేఆర్, ఆర్సీబీ తలపడనున్నాయి.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం