Mrunal Thakur: చిరంజీవికి హీరోయిన్‍గా సీతారామం బ్యూటి మృణాల్.. ఎందుకు సెలెక్ట్ చేశారంటే?
Chiranjeevi Mrunal Thakur: బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్, సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా సూపర్ ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్‍గా చేయనుందని టాక్ వస్తోంది. ఇంతకీ అది ఏ మూవీ, మృణాల్ ఠాకూర్‍ను తీసుకోడానికి గల కారణాలు ఏంటనే వివరాల్లోకి వెళితే..
హను రాఘవపూడి అద్భుతంగా మలిచిన ప్రేమ కావ్యం సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఇందులో సీతగా యువతతో పాటు ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్ అందరినీ మెప్పించింది ఈ బ్యూటిఫుల్. దీంతో ఆమెకు తెలుగులో సూపర్ క్రేజ్ పెరిగింది. ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న ఈ సొగసరి తాజాగా మెగాస్టార్ చిరంజీవితో రొమాన్స్ చేసేందుకు అవకాశం కొట్టేసిందని టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ఇటీవల భోళా శంకర్ సినిమాతో ప్లాప్ తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి బ్రో డాడీకి రీమేక్ కాగా.. మరొకటి సోషియో ఫాంటసీ చిత్రం. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవితో ఓ సినిమా తెరకెక్కుతుందని తెలిసిందే. మెగా 157గా (Mega157) వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‍ను ఇటీవల చిరంజీవి బర్త్ డేకు 'విశ్వానికి మంచి' అంటూ విడుదల చేశారు. దానికి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈ సినిమాలోనే మృణాల్ ఠాకూర్‍ను హీరోయిన్‍గా సెలెక్ట్ చేశారట మేకర్స్.
యూవీ క్రియేషన్ బ్యానర్‍లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి, వశిష్ఠ మెగా 157 సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాదాన్యత ఉంటుందట. ఆ పాత్రకు మృణాల్ ఠాకూర్ అయితేనే పూర్తిగా న్యాయం చేయగలదని దర్శకనిర్మాతలు భావించారట. అందుకే చిరంజీవికి జోడిగా మృణాల్‍ను తీసుకున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, ఒకవేళ ఇదే నిజమైతే చిరంజీవితో మృణాల్ రొమాన్స్ చేయనుంది. అలాగే మృణాల్ సినీ కెరీర్ భవిష్యత్తులో ఇంకా బాగుంటుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే చిరంజీవి తన కూతురు సుశ్మిత కొణిదెల బ్యానర్ అయిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ లో మెగాస్టార్ సినిమా చేయనున్నారు. అది మలయాళం సూపర్ హిట్ మూవీ బ్రో డాడీ అని టాక్. ఇక మృణాల్ ఠాకూర్ తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. నానితో కలిసి 'హాయ్ నాన్న' సినిమా ఒకటి కాగా.. విజయ్ దేవరకొండతో పరశురామ్ దర్శకత్వంలో మరో మూవీ చేయనుంది. దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ కన్ఫర్మ్ అయితే ఆమె టాలీవుడ్ సినీ కెరీర్‍కు తిరుగు ఉండదు అని విశ్లేషకులు భావిస్తున్నారు.