Mrunal Thakur Marriage: తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న మృణాల్ ఠాకూర్.. ఆమె రియాక్షన్ ఎలా ఉందో చూడండి
Mrunal Thakur Marriage: తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న మృణాల్ ఠాకూర్ అంటూ వస్తున్న పుకార్లపై ఈ సీతారామం బ్యూటీ స్పందించింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆమె రియాక్టయింది.
Mrunal Thakur Marriage: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతోందా? అందులోనూ ఆమె ఓ తెలుగు వ్యక్తిని పెళ్లాడనుందా? శుక్రవారం (నవంబర్ 3) ఉదయం నుంచి వస్తున్న ఈ వార్తలపై ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించింది. ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే చెప్పండి.. ఎలాగూ పెళ్లి ఫిక్స్ చేశారు కదా లొకేషన్, వెన్యూ వివరాలు కూడా పంపండి అంటూ నవ్వేసింది.
తన పెళ్లి పుకార్లపై మృణాల్ సరదాగా స్పందించింది. శుక్రవారం (నవంబర్ 3) ఉదయం ఓ ఇన్స్టా స్టోరీ పోస్ట్ చేసింది. "హాయ్, మీ హార్ట్స్ బ్రేక్ చేసినందుకు క్షమించండి. నేను ఓ తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని గంట నుంచి నాకు ఫోన్ చేస్తున్న స్లైలిష్ డిజైనర్లు, నా ఫ్రెండ్స్, కుటుంబానికి ఒకటే చెబుతున్నాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని నాకు కూడా ఉత్సాహంగా ఉంది.
కానీ క్షమించండి. ఇది ఉత్త పుకారే. ఇది చాలా ఫన్నీగా ఉంది. ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. ఎలాగూ అబ్బాయిని మీరే చూసి నా పెళ్లి ఫిక్స్ చేశారు కదా. అలాగే వెన్యూ, లొకేషన్ వివరాలు కూడా పంపించండి" అని మృణాల్ అనడం విశేషం.
ఈ మధ్య ఓ అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును మృణాల్ ఠాకూర్ కు అందించిన తర్వాత.. ఆమె ఇక్కడే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని, హైదరాబాద్ లోనే సెటిలవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అప్పటి నుంచే మృణాల్ పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి. సీతారామం బ్యూటీ తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకోనుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
సినిమా నటులపై ఇలాంటి పుకార్లు కామనే అయినా.. మృణాల్ మాత్రం వెంటనే వీటిపై స్పందించి వివరణ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం మృణాల్.. నానితో కలిసి నటించిన హాయ్ నాన్ని రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. విజయ్ దేవరకొండతోనూ వీడీ13 మూవీలో నటిస్తోంది.