గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను చూసి కన్నీళ్లు పెట్టుకున్న మృణాల్ ఠాకూర్.. తమన్నాను మెచ్చుకున్న ప్రియాంక..-mrunal thakur emotional after seeing priyanka chopra in bvlgari store launch in mumbai and praise tamanna dance ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను చూసి కన్నీళ్లు పెట్టుకున్న మృణాల్ ఠాకూర్.. తమన్నాను మెచ్చుకున్న ప్రియాంక..

గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను చూసి కన్నీళ్లు పెట్టుకున్న మృణాల్ ఠాకూర్.. తమన్నాను మెచ్చుకున్న ప్రియాంక..

Sanjiv Kumar HT Telugu

గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను చూసి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేసింది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. అక్టోబర్ 1న జరిగిన బుల్గారి స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన ఈ ఇద్దరు హీరోయిన్లు హగ్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ అవడానికి గల కారణాల్లోకి వెళితే..!

గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను చూసి కన్నీళ్లు పెట్టుకున్న మృణాల్ ఠాకూర్.. తమన్నాను మెచ్చుకున్న ప్రియాంక..

హిందీ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లి గ్లోబల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా. అయితే, ఇటీవల అక్టోబర్ 1న సాయంత్రం ముంబైలో జరిగిన బుల్గారి స్టోర్ ప్రారంభోత్సవానికి ప్రియాంక చోప్రా హాజరైంది. ఈ ఈవెంట్ కోసం అమెరికా నుంచి ఇండియాకు విచ్చేసింది ఈ గ్లోబల్ బ్యూటీ.

ఒక్కసారిగా ఎమోషనల్

అయితే, ఇదే ఈవెంట్‌కు సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా హాజరైంది. ఇతర సెలబ్రిటీలతో ప్రియాంక చోప్రా మాట్లాడుతుండగా మృణాల్ ఠాకూర్ గ్లోబల్ స్టార్‌ను చూసింది. ప్రియాంక చోప్రాను చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చింది మృణాల్ ఠాకూర్.

ఐ లవ్యూ అంటూ

ప్రియాంక చోప్రాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది మృణాల్ ఠాకూర్. అలాగే, ప్రియాంక చోప్రాను హగ్ చేసుకుని ఐ లవ్యూ అని చెప్పింది మృణాల్. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అందులో మృణాల్ ఎమోషనల్ అవడం, ప్రియాంకకు ఐ లవ్యూ చెప్పడం చూడొచ్చు.

సొగసైన తెల్లని దుస్తుల్లో

ఇదిలా ఉంటే, ఈ ఈవెంట్‌కు హాజరైన మృణాల్ స్ట్రాప్‌లెస్ బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌లో అందంగా కనిపించింది. ఇక ప్రియాంక చోప్రా సొగసైన వైట్ దుస్తుల్లో అట్రాక్టివ్‌గా మెరిసింది. అనంతరం తమన్నాను చూసిన ప్రియాంక చోప్రా పలకరించిన ఆప్యాయంగా కౌగిలించుకుంది.

అద్భుతమైన డ్యాన్సర్‌వి

ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా నటనను తమన్నా ప్రశంసించింది. దీనిపై ప్రియాంక చోప్రా స్పందిస్తూ, “నేను నిన్ను చూస్తున్నాను. నువ్వు చాలా అద్భుతమైన డ్యాన్సర్” అని తమన్నా డ్యాన్స్‌లో తనకు నచ్చిన విషయాలను పంచుకుంది. ఈ ఈవెంట్‌లో త్రిప్తి డిమ్రి, కీర్తి సురేష్, సమంత రూత్ ప్రభు కూడా పాల్గొన్నారు.

మళ్లీ కలుద్దామంటూ

మరుసటి ఉదయం, ప్రియాంక చోప్రా ముంబై విమానాశ్రయంలో కనిపించింది. డెనిమ్‌లో సాధారణ దుస్తులు ధరించిన ప్రియాంక చోప్రా చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఫొటోగ్రాఫర్లకు అభివాదం చేసింది. “చల్తే హై ఫిర్ అబ్ (మళ్లీ కలుద్దాం)” అంటూ ప్రియాంక చోప్రా వెళ్లిపోయింది.

మహేశ్ బాబుతో ప్రియాంక

కాగా, ప్రియాంక చోప్రా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో SSMB29లో నటించనుంది. ఈ సినిమాను దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న ది బ్లఫ్ చిత్రంలో 19వ శతాబ్దపు కరీబియన్ పైరేట్‌గా కనిపించనుంది ప్రియాంక.

సన్నాఫ్ సర్దార్ 2లో మృణాల్

మరోవైపు మృణాల్ ఠాకూర్ చివరిగా అజయ్ దేవగన్ సరసన సన్ ఆఫ్ సర్దార్ 2లో కనిపించింది. ఇది ఇటీవల థియేట్రికల్ రన్ ముగించుకుని ఇప్పుడు సన్నాఫ్ సర్దార్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం