Mr Bachchan: హీరోయిన్‍కు లేని బాధ మీకెందుకు: ట్రోలర్లపై డైరెక్టర్ హరీశ్ శంకర్ ఫైర్
Mr Bachchan - Harish Shankar: మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన రవితేజ, భాగ్యశ్రీ ఏజ్ గ్యాప్ విషయంలో సోషల్ మీడియాలో చాలాకాలంగా ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై డైరెక్టర్ హరీశ్ శంకర్ గట్టిగా బదులిచ్చారు.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాపై ఫుల్ క్రేజ్ ఉంది. ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. టీజర్, పాటలు ఆకట్టుకోవడంతో మంచి అంచనాలు ఉన్నాయి. 1980ల బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ డ్రామా మూవీగా ఈ చిత్రం వస్తోంది. అయితే, ఈ చిత్రంలో జంటగా నటించిన హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ మధ్య ఏజ్ గ్యాప్ విషయం కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనిపై కొందరు ట్రోల్స్ కూడా చేశారు. దర్శకుడు హరీశ్ శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్‍పై స్పందించారు. గట్టిగా బదులిచ్చారు.
మాస్ మహారాజ వయస్సు ప్రస్తుతం 56 ఏళ్లు కాగా.. మిస్టర్ బచ్చన్‍లో హీరోయిన్‍గా చేసిన భాగ్యశ్రీ ఏజ్ 25 సంవత్సరాలుగా ఉంది. ఇద్దరి మధ్య దాదాపు 29 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. దీనిపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేశారు. భాగ్యశ్రీతో రవితేజ రొమాన్స్ చేయడం బాగోలేదంటూ ట్రోలింగ్‍కు దిగారు. కొంతకాలంగా ఇది సాగుతోంది. ఇలా ట్రోల్ చేస్తున్న వారిపై హరీశ్ శంకర్ ఫైర్ అయ్యారు.
ఆ విషయం గుర్తుంచుకోండి
సినిమాల్లో నటులు వారి వయసుకు తగినట్టుగా మాత్రమే అన్ని క్యారెక్టర్లు చేయరని గుర్తుంచుకోవాలని డైరెక్టర్ హరీశ్ శంకర్ అన్నారు. వేరే వయసు వారిలా నటనతో వారు నమ్మించాల్సి ఉంటుందని తెలిపారు. అసలు సినిమాల విషయంలో ఈ ఏజ్ గ్యాప్‍పై ఎందుకు రచ్చ జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని అన్నారు. “సినిమాల్లో ఓ యాక్టర్ ఎప్పుడూ తన వయసు పాత్రలే చేయరు. ఒక్కోసారి 25 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి కూడా 50 ఏళ్లు ఉన్నట్టు మనల్ని నమ్మించాలి. అదే యాక్టింగ్. దీన్ని స్క్రీన్ ఏజ్ అంటారు” అని హరీశ్ శంకర్ చెప్పారు.
హీరోయిన్‍కే సమస్య లేదు కదా..
ఏజ్ గ్యాప్‍పై హీరోయిన్‍కు ఎలాంటి సమస్య లేదని, అలాంటప్పుడు మీకొచ్చిన బాధ ఏంటని ట్రోలర్లను నేరుగా ప్రశ్నించారు హరీశ్ శంకర్. “ఏజ్ గ్యాప్ గురించి ఆ నటికి (భాగ్యశ్రీ) ఎలాంటి సమస్య లేదు. అందుకే ఈ సినిమా చేసేందుకు అంగీకరించారు. ఆ నటి అనుకూలంగా ఉన్నప్పుడు కొందరు వేరే వ్యక్తులు ఎందుకు బాధపడుతున్నారు?” అని హరీశ్ శంకర్ అన్నారు.
ధమాకా విషయంలోనూ..
ధమాకా సినిమా విషయంలోనూ రవితేజ, శ్రీలీల ఏజ్ గ్యాప్‍పై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. అయితే, ఆ మూవీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ విషయాన్ని హరీశ్ శంకర్ ఇప్పుడు గుర్తు చేశారు. “ఒకవేళ ధమాకా ఫెయిల్ అయి ఉంటే, తక్కువ వయసు ఉన్న అమ్మాయిని హీరోయిన్‍గా తీసుకున్నందుకే ఇలా జరిగిందని ట్రోలర్స్ అనేవారు. ఆ చిత్రం పెద్ద హిట్ అవడంతో సైలెంట్ అయ్యారు. ఇది తప్పు. ఇలా రెండు మాటలు మార్చే వారు నాకు నచ్చరు” అని హరీశ్ శంకర్ చెప్పారు. ఏజ్ గ్యాప్ ఉన్నా అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి ఎన్నో బ్లాక్‍బస్టర్ సినిమాలు ఇచ్చారు కదా అని ఆయన అన్నారు.
మిస్టర్ బచ్చన్ సినిమా ట్రైలర్ నేటి (ఆగస్టు 7) సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు తీసుకురానున్నట్టు మూవీ టీమ్ వెల్లడించింది. ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది.