మలయాళం మూవీ మిస్టర్ అండ్ మిస్ బ్యాచ్‌లర్ ఓటీటీలోకి వస్తోంది. జూలై 11 నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. రిలీజ్ డేట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది.
మిస్టర్ అండ్ మిస్ బ్యాచ్‌లర్ మూవీలో ఇంద్రజీత్ సుకుమారన్, అనశ్వర రాజన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దీపు కరుణాకరణ్ దర్శకత్వం వహించాడు.
మే నెలాఖరున థియేటర్లలో రిలీజైన మిస్టర్ అండ్ మిస్ బ్యాచ్‌లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరోయిన్ అనశ్వర రాజన్ పాల్గొనకపోవడం వివాదానికి దారితీసింది. ఆమెపై మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో డైరెక్టర్ కంప్లైంట్ ఇచ్చాడు. చివరకు మేకర్స్‌తో రాజీ కుదుర్చుకొని ఓ మెట్టు దిగిన అనశ్వర ప్రమోషన్స్‌కు హాజరైంది.
మరికొద్ది నిమిషాల్లో పెళ్లి అనగా పీటలపై నుంచి పారిపోతుంది స్టెఫీ. నలభై ఏళ్లు వచ్చిన పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్‌గా మిగిలిపోయిన జీతూ ఆమెకు పరిచయం అవుతాడు. అనుకోకుండా వారిద్దరూ కలిసి ఓ జర్నీ సాగించాల్సివస్తుంది? ఈ ప్రయాణంలో ఏం జరిగింది? జీతూ పెళ్లిచేసుకోకపోవడానికి కారణం ఏంటి? స్టెఫీ పెళ్లి పీటలపై నుంచి ఎందుకు పారిపోయింది అన్నదే ఈ మూవీ కథ.
పృథ్వీరాజ్ సుకుమారన్ సోదరుడైన ఇంద్రజీత్ సుకుమారన్ మలయాళంలో వెర్సటైల్ యాక్టర్‌గా కొనసాగుతోన్నాడు. హీరోగానే కాకుండా విలన్‌గా పలు సినిమాలు చేశాడు. తెలుగులో కావ్యస్ డైరీ అనే సినిమాతో పాటు త్రిష బృంద వెబ్‌సిరీస్‌లో నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో కనిపించాడు.
ఈ ఏడాది రిలీజైన రేఖచిత్రం మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నది అనశ్వర రాజన్. రేఖ అనే అమ్మాయిగా టైటిల్ పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. 7 జీ బృందావన కాలనీ సీక్వెల్‌తో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నది అనశ్వర రాజన్.