OTT Telugu Movies: ఈవారం తెలుగులో ఓటీటీల్లోకి రానున్న సినిమాలు ఇవే.. హరోం హర, మహారాజ సహా మరిన్ని..-movies to release telugu in otts this week harom hara maharaja plot netflix amazon aha amazon prime video etv win ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movies: ఈవారం తెలుగులో ఓటీటీల్లోకి రానున్న సినిమాలు ఇవే.. హరోం హర, మహారాజ సహా మరిన్ని..

OTT Telugu Movies: ఈవారం తెలుగులో ఓటీటీల్లోకి రానున్న సినిమాలు ఇవే.. హరోం హర, మహారాజ సహా మరిన్ని..

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 10, 2024 09:54 PM IST

OTT Telugu Movies This week: ఈ వారం ఓటీటీల్లోకి తెలుగులో ఎక్కువగానే సినిమాలు వస్తున్నాయి. ఓ మూవీ రెండు ప్లాట్‍ఫామ్‍ల్లో అడుగుపెట్టనుంది. విజయ్ సేతుపతి సూపర్ హిట్ చిత్రం కూడా అందుబాటులోకి రానుంది.

OTT Telugu Movies: ఈవారం తెలుగులో ఓటీటీల్లోకి రానున్న సినిమాలు ఇవే.. హరోం హర, మహారాజ సహా మరిన్ని..
OTT Telugu Movies: ఈవారం తెలుగులో ఓటీటీల్లోకి రానున్న సినిమాలు ఇవే.. హరోం హర, మహారాజ సహా మరిన్ని..

ఓటీటీల్లో తెలుగులో సినిమాలు చూడాలనుకునే వారికి ఈ వారం చాలా చిత్రాలు అందుబాటులోకి రానున్నాయి. సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హర సినిమా ఈ వారంలోనే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రం రెండు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి రానుంది. అలాగే, రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా ఈ వారం తెలుగులో స్ట్రీమింగ్‍కు వస్తున్నాయి. మరిన్ని సినిమాలు కూడా ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాయి. ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి రానున్న తెలుగు సినిమాలో ఏవో ఇక్కడ చూడండి.

హరోం హర

హరోం హర సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ చిత్రం జూలై 11వ తేదీన ఆహా, ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ఒకే రోజున రెండు ఓటీటీల్లో అడుగుపెడుతోంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ హరోం హరకు ద్వారక జ్ఞానసాగర్ దర్శకత్వం వహించగా.. మాళవిక శర్మ హీరోయిన్‍గా చేశారు. సునీల్ ఓ కీలకపాత్ర చేశారు. జూన్ 14న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం 27 రోజుల్లో ఓటీటీల్లో అడుగుపెడుతోంది.

మహారాజ

తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. ఈ సినిమా జూలై 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమ్ కానుంది. జూన్ 14న థియేటర్లలో రిలీజైన మహారాజ చిత్రం రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు.

ధూమం

మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ధూమం సినిమా తెలుగు డబ్బింగ్‍లో వస్తోంది. జూలై 11న ఆహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. గతేడాది జూన్‍లో థియేటర్లలో రిలీజైన ఈ మలయాళ చిత్రం ధూమం.. ఇప్పుడు తెలుగులో ఆహా ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ప్లాట్

వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన ప్లాట్ చిత్రం జూలై 11వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. గతేడాది నవంబర్‌లో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రిలీజైంది. భాను భావ తార్కిక దర్శకత్వం వహించిన ప్లాట్ మూవీ ఎనిమిది నెలల తర్వాత ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తోంది.

జిలేబీ

జిలేబీ సినిమా జూలై 13వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. నువ్వు నాకు నవ్వాచ్ సహా చాలా హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కే విజయ్ భాస్కర్ ఈ మూవీని తెరకెక్కించారు. జిలేబీ చిత్రం గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే హిట్ కాలేకపోయింది. జిలేబీ సినిమాతో విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అయ్యాడు. థియేటర్లలోకి వచ్చిన 11 నెలల తర్వాత ఈ సినిమా ఆహా ఓటీటీలోకి వస్తోంది.

మైదాన్

బాలీవుడ్ సినిమా ‘మైదాన్’ ఇటీవలే తెలుగులోనూ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాదీ లెజెండరీ ఫుట్‍బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితంపై ఈ మూవీ తెరకెక్కింది. ప్రదాన పాత్ర పోషించారు అజయ్ దేవ్‍గణ్. ఏప్రిల్ 10న థియేటర్లలో ఈ చిత్రం రిలీజైంది. జూన్‍లోనే హిందీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చిన మైదాన్ చిత్రం.. ఈ వారంలోనే జూలై 9న తెలుగు ఆడియోలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రానికి అమిత్ శర్మ దర్శకత్వం వహించారు.

WhatsApp channel