Re Release Collections: ఒరిజినల్ రిలీజ్ కంటే రీ-రిలీజ్ చేసినప్పుడు అధికంగా కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు!
Re Release Movies Box Office Collection: కొన్ని సినిమాలు థియేటర్లలో మొదటిసారిగా విడుదల చేసినప్పుడు సాధించిన కలెక్షన్స్ కంటే రీ రిలీజ్ చేసినప్పుడు రాబట్టిన బాక్సాఫీస్ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ?, వాటికి వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Re Release Movies Box Office Collection: ఈ మధ్య కాలంలో సినిమాల ఫలితాలు చెప్పలేని విధంగా ఉంది. గతంలో విడుదలై ప్లాప్‌గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు బ్లాక్ బస్టర్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. అయితే, కొన్ని సినిమాలు ఫస్ట్ టైమ్ ఒరిజినల్‌గా థియేట్రికల్ రిలీజ్ అయినప్పుడు కంటే రీ రిలీజ్ సమయంలో ఎక్కువ బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
తుంబాడ్
హారర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తుంబాడ్ సినిమా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2018లో వచ్చిన ఈ సినిమాను మొదటిసారి థియేట్రికల్ రిలీజ్ చేసినప్పుడు రూ. 14 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కానీ, ఆ తర్వాత ఓటీటీ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇటీవల థియేటర్లలో తుంబాడ్ సినిమాను రీ రిలీజ్ చేయగా.. ఏకంగా రూ. 38 కోట్ల వరకు బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చాయి.
ఈ నగరానికి ఏమైంది
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్‌లో చాలా గుర్తుండిపోయే సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది ముందుంటుంది. హీరోగా విశ్వక్‌కు డైరెక్టర్‌గా తరుణ్ భాస్కర్‌కు కమెడియన్‌గా అభినవ్ గోమఠంకు మంచి క్రేజ్ వచ్చింది. అయితే, ఈ సినిమా మొదటిసారి థియేటర్లలో విడుదలైనప్పుడు రూ. 80 లక్షల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. కానీ, రీ రిలీజ్ చేసినప్పుడు మాత్రం మొదటిరోజునే ఏకంగా రూ. 2 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది ఈ నగరానికి ఏమైంది సినిమా.
సనమ్ తేరి కసమ్
హిందీలో రొమాంటిక్ లవ్ స్టోరీగా మంచి పేరు తెచ్చుకున్న సినిమా సనమ్ తేరి కసమ్. ఇటీవల రీ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ హాట్ టాపిక్‌గా మారాయి. థియేటర్లలో అంతంతమాత్రంగా చూసిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాకా ఎంతోమంది యూత్‌ను మెప్పించింది.
ఫలితంగా ఇటీవల రీ రిలీజ్ చేసినప్పుడు ఏకంగా 22 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. కానీ, ఇదే సనమ్ తేరి కసమ్ సినిమాను మొదటిసారిగా థియేటర్లలో విడుదల చేసినప్పుడు మాత్రం రూ. 9 కోట్ల బాక్సాఫీస్ వసూల్లు మాత్రమే వచ్చాయి. దీంతో రీ రిలీజ్ అయి అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా సనమ్ తేరి కసమ్ నిలిచింది.
ఆరేంజ్
రామ్ చరణ్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీ ఆరేంజ్. ఈ సినిమా మొదటిసారి విడుదలైనప్పడు నెగెటివిటీ మూట గట్టుకుంది. ఫలితంగా అంతంతమాత్రంగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ, రోజులు గడిచాక ఆరేంజ్ సినిమా ఏంటో అందరికి తెలిసింది. ఇక ఆరేంజ్ రీ రిలీజ్ చేసినప్పుడు మొదటి థియేట్రికల్ రిలీజ్ కంటే అధికంగా కలెక్షన్స్ రాబట్టింది.
సంబంధిత కథనం