Movies releasing in theatres: ఈవారం థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే.. ఈ రెండూ చాలా స్పెషల్
Movies releasing in theatres: ఈ వారం ఓటీటీలతోపాటు థియేటర్లలోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో రెండు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు.
Movies releasing in theatres: థియేటర్లలోకి ఈ వారం వివిధ భాషల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో రెండు తెలుగు సినిమాలు ఉండగా.. మరొక మలయాళ డబ్బింగ్ మూవీ కూడా రిలీజ్ కానుంది. ఇక ఇంగ్లిష్, హిందీల్లోనూ మరో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ వారం రిలీజ్ కానున్న జాబితాలో ఉన్నాయి. మొత్తం ఐదు సినిమాల్లో రెండు మాత్రం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న టిల్లూ స్క్వేర్, ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) కావడం విశేషం.
థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు
టిల్లూ స్క్వేర్
సూపర్ హిట్ డీజే టిల్లూకి సీక్వెల్ గా వస్తున్న మూవీ టిల్లూ స్క్వేర్. గతేడాది సెప్టెంబర్ నుంచి వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. మొత్తానికి శుక్రవారం (మార్చి 29) థియేటర్లలోకి రాబోతోంది. సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ చాలా ఆసక్తి రేపుతున్నాయి. డీజే టిల్లు హిట్ అవడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ (ఆడుజీవితం అని కూడా పిలుస్తున్నారు) మూవీ కూడా ఈ శుక్రవారమే (మార్చి 29) థియేటర్లలోకి రాబోతోంది. 2008లో అనుకున్న సినిమా మొత్తానికి ఇప్పుడు రిలీజ్ అవుతోంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మలయాళంలో మరో రూ.100 కోట్ల కలెక్షన్ల మూవీగా నిలుస్తుందని భావిస్తున్నారు. తెలుగులోనూ ఈ సినిమాను డబ్ చేశారు. హైదరాబాద్ లోనూ మేకర్స్ మంచి ప్రమోషన్లే నిర్వహించారు. సలార్ మూవీతో పృథ్వీరాజ్ తెలుగువారికి కూడా దగ్గరైన విషయం తెలిసిందే.
కలియుగ పట్టణంలో
తెలుగులో ఈ వారం రిలీజ్ కాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ కలియుగ పట్టణంలో. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ శుక్రవారం రిలీజ్ కానుంది. రమాకాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మదర్ సెంటిమెంట్ తోపాటు థ్రిల్ అందించే మూవీ అని మేకర్స్ చెబుతున్నారు.
గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్
గతంలో వచ్చిన గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ మూవీ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు కదా. ఇప్పుడీ మాన్‌స్టర్‌వెర్స్ ఫ్రాంఛైజీ నుంచి గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్ పేరుతో మరో మూవీ రాబోతోంది. ఈ మూవీ కూడా ఇంగ్లిష్ తోపాటు పలు ఇతర భాషల్లోనూ ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఇందులో గాడ్జిల్లా, కాంగ్ కలిసి ప్రపంచానికి ఎదురైన ఓ కొత్త సవాలను అధిగమించడం చూడొచ్చు.
క్రూ (Crew)
క్రూ ఓ హిందీ మూవీ. ప్రముఖ బాలీవుడ్ నటీమణులు టబు, కరీనా కపూర్, కృతి సనన్ ఎయిర్ హోస్టెస్ లుగా నటించిన సినిమా ఇది. బంగారం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాకు రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ మధ్యే రిలీజైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
టాపిక్