టూరిస్ట్ ఫ్యామిలీ న‌చ్చిందా? జియోహాట్‌స్టార్‌లోనే ఉన్న అలాంటి ఫ్యామిలీ డ్రామా మూవీస్‌పై ఓ లుక్కేయండి-movies like tourist family on jiohotstar ott emotional drama tamil film simran falimy gulmohar family star drishyam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  టూరిస్ట్ ఫ్యామిలీ న‌చ్చిందా? జియోహాట్‌స్టార్‌లోనే ఉన్న అలాంటి ఫ్యామిలీ డ్రామా మూవీస్‌పై ఓ లుక్కేయండి

టూరిస్ట్ ఫ్యామిలీ న‌చ్చిందా? జియోహాట్‌స్టార్‌లోనే ఉన్న అలాంటి ఫ్యామిలీ డ్రామా మూవీస్‌పై ఓ లుక్కేయండి

చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజై సంచలన సృష్టించిన మూవీ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. ఓటీటీలోనూ ఈ తమిళ సినిమా దూసుకెళ్తోంది. అలాంటి ఫ్యామిలీ కామెడీ, ఎమోషన్ ఉన్న ఇతర సినిమాలూ జియోహాట్‌స్టార్‌లో ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి.

టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ స్టిల్ (x/jiohotstar)

ఇటీవల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ గురించి పెద్ద టాక్ వినిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ తమిళ్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. స్వచ్ఛమైన కామెడీ, గుండెను హత్తుకునే ఎమోషన్, హాయి కలిగించే ఫ్యామిలీ డ్రామా.. ఇలా టూరిస్ట్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికీ తెగ నచ్చేస్తోంది.

ఓటీటీలోనూ అదుర్స్

టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. జూన్ 2 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఈ మూవీ ఉంది. ఇప్పటికే మీరు ఈ మూవీ చూసి ఉంటే తప్పక నచ్చే ఉంటుంది. ఇదే ఓటీటీలో ఇలాంటి ఫ్యామిలీ స్టోరీ సినిమాలు ఇంకా ఉన్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ మూవీస్ లిస్ట్ మీ కోసం.

ఫలిమీ

ఒక కుటుంబంలో వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ.. విభిన్నమైన మనస్తత్వంతో ఉండే మనుషుల కథ ఇది. ఆ ఇంట్లోని పెద్దాయనను కాశీకి తీసుకెళ్లే క్రమంలో జరిగే మానసిక సంఘర్షణ, అక్కడికి వెళ్లాక ఎదురయ్యే ట్విస్ట్ లు.. ఈ మలయాళ సినిమా ఫలిమీని ప్రత్యేకంగా మార్చాయి. కాశీలో తాతయ్య చనిపోయారని, అంత్యక్రియలు కూడా జరిగాయని తెలిశాక ఆ ఫ్యామిలీ ఎమోషన్ ఫ్యాన్స్ కు కనెక్ట్ అవుతుంది. కానీ తీరా తాతయ్య బతికే ఉన్నాడని తెలిశాక ఏం జరిగింది? కాశీ ప్రయాణం పూర్తయిందా? అనేది ఆసక్తి రేపుతోంది.

గుల్మోహర్

తరతరాలుగా ఉంటున్న ఇంటికి వదిలి వెళ్లే క్రమంలో ఓ కుటుంబం పడ్డ ఆవేదన, ఆ సమయంలో బయటపడే రహస్యాలు.. ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో వచ్చిన హిందీ సినిమా గుల్మోహర్. కుటుంబ అనుబంధాలు, సమయాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా మారే మనుషులు.. ఇలా మనసును తాకే ఎమోషన్స్ తో ఈ మూవీ రూపొందింది.

బజరంగీ భాయిజాన్

పాకిస్థాన్ నుంచి భారత్ కు వచ్చి, ఇక్కడ తప్పిపోయిన ఓ పాపను తిరిగి వాళ్ల దేశం చేర్చే హీరో కథే బజరంగీ భాయిజాన్ సినిమా. ఈ సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ కచ్చితంగా హృద‌యాన్ని క‌దిలిస్తుంది. తల్లితో కలిసి పాక్ నుంచి భారత్ వచ్చిన మూగ పాప ఇక్కడ మధ్యలో రైలు దిగుతుంది. ఆ రైల్లో తల్లి వెళ్లిపోతుంది. ఆ పాపను హీరో తిరిగి పాకిస్థాన్ కు ఎలా చేర్చాడు? ఆ క్రమంలో నెలకొన్న ఎమోషనల్ జర్నీ ఎలాంటిది? అనేది ఈ మూవీలో చూడొచ్చు.

దృశ్యం

ఫ్యామిలీ ఎమోషన్, కుటుంబం కోసం హీరో పోరాడే కథ అంటే ముందుగా గుర్తొచ్చే సినిమాల్లో కచ్చితంగా దృశ్యం ఉంటుంది. తన కుటుంబానికి ఊహించని సమస్య ఎదురైతే.. తండ్రి ఎలా నిలబడ్డాడు? అనేదే దృశ్యం కథ. ఈ మూవీ మంచి థ్రిల్లర్ కూడా. ఈ మలయాళ ఒరిజినల్ మూవీని హిందీ, తెలుగులోనూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. దృశ్యం 2 కూడా ఆడియన్స్ ను అలరించింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం