ఒకే రోజు ఆరు సీరియల్స్‌కు శుభం కార్డు వేయబోతున్నది ఈటీవీ. మధ్యాహ్నం స్లాట్ సీరియల్స్‌లో భారీగా మార్పులు చేస్తోంది ఈటీవీ. ఈ మార్పుల్లో భాగంగా పన్నెండు గంటల నుంచి మూడు గంటల టైమ్‌లో ఏడు కొత్త సీరియల్స్‌ను మొదలుపెట్టబోతున్నది. వీటి కోసం ఆరు పాత సీరియల్స్‌కు అర్ధాంతంరంగా ప్యాకప్ చెబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీకెండ్‌తోనే ఈ సీరియల్స్ ముగియబోతున్నట్లు సమాచారం.
వసంత కోకిల, రాధమనోహరం, కాంతార, మౌన పోరాటం సీరియల్స్‌కు ఈ శనివారం నాడు ఎండింగ్ పడబోతున్నట్లు సమాచారం. టీఆర్‌పీ రేటింగ్ తక్కువగా ఉండటం, అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో ఈ నాలుగు సీరియల్స్‌కు ముగించేసి వాటి స్థానంలో కొత్త సీరియల్స్‌ను మొదలుపెట్టబోతున్నారు. ఈ నాలుగు సీరియల్స్‌తో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు, కావ్య సీరియల్స్‌కు కూడా ఈ శనివారమే శుభం కార్డు పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ ఆరు సీరియల్స్‌లో మౌన పోరాటం 950 ఎపిసోడ్స్ దాటగా...ఆడవాళ్లు మీకు జోహార్లు 890 ఎపిసోడ్స్ వరకు టెలికాస్ట్ అయ్యింది. మిగిలిన సీరియల్స్ అన్ని మూడు వందల ఎపిసోడ్స్ లోపే ముగియనున్నాయి.
ఈ ఆరు సీరియల్స్ స్థానంలో ప్రారంభమయ్యే ఏడు కొత్త సీరియల్స్ టైటిల్స్‌తో పాటు యాక్టర్స్ ఎవరన్నది ఈటీవీ రివీల్ చేసింది. ఈ సీరియల్స్ తాలూకు ప్రోమోలోను రిలీజ్ చేశారు. మే 26 నుంచి ఈ కొత్త సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయని ఈటీవీ ప్రకటించింది.
శుభాకాంక్షలు, ఆరోప్రాణం, సంధ్యారాగం సీరియల్స్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటిగంట వరకు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఈ మూడు సీరియల్స్ టెలికాస్ట్ టైమ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే ఉండబోతున్నట్లు ఈటీవీ వెల్లడించింది.
వీటితో పాటు జీవన తరంగాలు, వసుంధర, మెరుపు కలలు, వేయి శుభములు కలుగునీకు సీరియల్స్ కూడా అదే రోజు మొదలుకాబోతున్నాయి. యమున, కావ్యశ్రీ, అవంతిక, సుష్మ కిరణ్ వంటి పాపులర్ టీవీ సీరియల్స్ ఈ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సంబంధిత కథనం