Most Watched Web Series: ఇండియాలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. మీరు చూశారా?-most watched web series in india is farzi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Watched Web Series: ఇండియాలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. మీరు చూశారా?

Most Watched Web Series: ఇండియాలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. మీరు చూశారా?

Hari Prasad S HT Telugu
Nov 16, 2023 10:25 AM IST

Most Watched Web Series: ఇండియాలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఫర్జీ (Farzi) నిలిచింది. మరి ఈ సిరీస్ మీరు చూశారా?

ఫర్జీ సిరీస్‌లో షాహిద్ కపూర్
ఫర్జీ సిరీస్‌లో షాహిద్ కపూర్ (HT_PRINT)

Most Watched Web Series: వెబ్ సిరీస్.. సినిమాల కంటే ఎక్కువగా, వేగంగా ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ ఇండియాలో అడుగుపెట్టి పదేళ్లు కూడా కాలేదు. ఇంగ్లిష్ వెబ్ సిరీస్ లు ఎన్నో దశాబ్దాలుగా వస్తున్నా.. హిందీ, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో ఇవి రావడం కొన్నేళ్ల కిందటే మొదలైంది.

అయితే ఇండియన్ ఆడియెన్స్ చాలా త్వరగానే ఈ వెబ్ సిరీస్ లకు అలవాటు పడ్డారు. వాటిని ఆదరించారు. మరి ఈ దశాబ్ద కాలంలో రిలీజైన వెబ్ సిరీస్ లలో ఇండియాలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఏది? దీనికి ఆర్మాక్స్ మీడియా (Ormax Media) సమాధానమిచ్చింది. ఈ సంస్థ రిపోర్టు ప్రకారం ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఫర్జీ (Farzi).

ఫర్జీ వెబ్ సిరీస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?

ఫర్జీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అడుగుపెట్టింది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, రాశీ ఖన్నాలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ వెబ్ సిరీస్ ను ఇప్పటి వరకూ ఏకంగా 3.71 కోట్ల మంది చూసినట్లు ఆర్మాక్స్ మీడియా రిపోర్టు వెల్లడించింది.

గతేడాది జనవరి నుంచి వెబ్ సిరీస్ డేటాను ఈ సంస్థ విశ్లేషిస్తోంది. ఫర్జీ వెబ్ సిరీస్ తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో వచ్చిన రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ ఉంది. ఈ సిరీస్ ను ఇప్పటి వరకూ 3.52 కోట్ల మంది చూశారు. మూడో స్థానంలో హాట్‌స్టార్ లోనే వచ్చిన ది నైట్ మేనేజర్ ఉంది. ఈ సిరీస్ ఇప్పటి వరకూ 2.86 కోట్ల వ్యూస్ సంపాదించింది.

అసలేంటీ ఫర్జీ స్టోరీ?

ఫర్జీ వెబ్ సిరీస్ దొంగ నోట్ల చుట్టూ తిరిగే కథ. ప్రముఖ తెలుగు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 8 ఎపిసోడ్ల సిరీస్ కట్టిపడేసేలా ఉంది. ఓ ఆర్టిస్ట్ డబ్బులు సంపాదించడానికి తన కళనే ఉపయోగించి దొంగ నోట్ల బిజినెస్ లోకి ఎలా వస్తాడన్నదే ఈ ఫర్జీ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ కు 8.4 ఐఎండీబీ రేటింగ్ రావడం విశేషం.

Whats_app_banner