IMDb Most Popular Movies 2024: ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు ఇవే.. మోస్ట్ అవేటెడ్ లిస్టులో పుష్ప 2 టాప్
IMDb Most Popular Movies 2024: ఐఎండీబీ 2024లో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ జాబితాను విడుదల చేసింది. అంతేకాదు ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లిస్టు కూడా వచ్చేసింది. కల్కి 2898 ఏడీ, పుష్ప 2 సినిమాల్లో ఆయా జాబితాల్లో టాప్ లో ఉన్నాయి.
IMDb Most Popular Movies 2024: ఈ ఏడాది ఇండియన్ సినిమా కొన్ని కమర్షియల్ విజయాలను చూసింది. కల్కి 2898 ఏడీ ప్రస్తుతం 2024 లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా నిలవడం విశేషం. ఇక డిసెంబర్ 6న విడుదల కానున్న పుష్ప: ది రూల్-పార్ట్ 2 మోస్ట్ అవేటెడ్ ఇండియన్ మూవీ అని ఐఎండీబీ యూజర్స్ పేజ్ ద్వారా షేర్ చేసింది.
ఐఎండీబీ పాపులర్ ఇండియన్ మూవీస్
ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ఈ ఏడాది పాపులర్ ఇండియన్ సినిమాల లిస్ట్, మోస్ట్ అవేటెడ్ మూవీస్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలను ప్రపంచవ్యాప్తంగా IMDBకి 250 మిలియన్లకు పైగా ఉన్న నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా రూపొందించారు.
పాపులర్ మూవీస్ జాబితాలో కల్కి 2898 ఏడీ మూవీ తొలి స్థానంలో నిలవడం విశేషం. ఇక రెండో స్థానంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమా మంజుమ్మెల్ బాయ్స్ ఉంది. ఈ గౌరవం దక్కడంపై కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించాడు.
"మా టీమ్ మొత్తం ఐఎండిబి జాబితాలో చోటు దక్కించుకోవడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకుల ప్రేమకు ప్రత్యక్ష సాక్ష్యం అని నేను అనుకుంటున్నాను' అని నాగ్ అశ్విన్ అన్నాడు.
2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ (ఇప్పటివరకు)
కల్కి 2898 - ఏడీ
ఫైటర్
హనుమాన్
సైతాన్
లాపతా లేడీస్
ఆర్టికల్ 370
ప్రేమలు
ఆవేశం
ముంజ్యా
మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్
ఇక 2024లో రిలీజ్ కాబోతున్న సినిమాల్లో మోస్ట్ అవేటెడ్ సినిమాల జాబితాను కూడా ఐఎండీబీ రిలీజ్ చేసింది. వీటిలో పుష్ప 2 తొలి స్థానంలో నిలవడం విశేషం. అంటే ఈ ఏడాది రెండు జాబితాల్లోనూ టాప్ లో ఉన్న సినిమాలు మన తెలుగువే కావడం నిజంగా గర్వకారణంగా చెప్పొచ్చు. ఇక రెండో స్థానంలోనూ మరో తెలుగు మూవీ, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర ఉంది.
ఆ లిస్ట్ ఇదే.,
పుష్ప: ది రూల్ - పార్ట్ 2
దేవర పార్ట్ 1
వెల్ కమ్ టు ద జంగిల్
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
కంగువ
సింగం అగైన్
భూల్ భులయ్యా 3
తంగలాన్
ఔరో మే కహా దమ్ థా
స్త్రీ 2
ఐఎండీబీ జాబితాలో దీపికా పదుకోన్
దీపికా పదుకోన్, దిశా పటానీ, అజయ్ దేవగణ్ లు ఈ రెండు లిస్ట్ లలోని ప్రాజెక్టులలో పాలుపంచుకోవడం గమనార్హం. కల్కి 2898 ఏడీలో దీపికా, దిశా నటించగా.. ఫైటర్ లోనూ దీపిక నటించింది. అజయ్ దేవగన్ సైతాన్ లో నటించాడు. ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న సింగం ఎగైన్ లోనూ దీపిక, అజయ్ తొలిసారి కలిసి నటించనున్నారు. దిశా రాబోయే విడుదలలలో వెల్ కమ్ టు ది జంగిల్, కంగువ సినిమాల్లో కనిపించనుంది.