Most Handsome Actor: ప్రపంచంలో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ఎవరో తెలుసా? షారుక్ ఖాన్‌కు పదో స్థానం
Most Handsome Actor: ప్రపంచంలో అత్యంత అందగాడైన యాక్టర్ ఎవరో తెలుసా? ఈ లిస్టులో ఇండియా నుంచి ఉన్న ఏకైక నటుడు షారుక్ ఖాన్. అతనికి కూడా పదో స్థానం దక్కింది. మరి తొలి స్థానంలో ఉన్న ఆ నటుడెవరో చూడండి.
Most Handsome Actor: మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ఇన్ ద వరల్డ్.. దీనిపై తాజాగా ఓ ప్లాస్టిక్ సర్జన్ తయారు చేసిన ఓ లిస్ట్ బయటకు వచ్చింది. దీని ప్రకారం బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ పదో స్థానంలో ఉన్నాడు. ఇండియాలో బిగ్గెస్ట్ యాక్టర్ గా పేరుగాంచిన షారుక్.. ఇలా అందగాళ్ల జాబితాలోనూ చోటు దక్కించుకోవడం విశేషం. మరి ఆ లిస్టులో ఇంకా ఎవరెవరున్నారో చూద్దామా?
మోస్ట్ హ్యాండ్సమ్ మేల్ యాక్టర్
షారుక్ ఖాన్ స్క్రీన్ పై తన పర్ఫార్మెన్స్ తోనే కాదు తన అందంతోనూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బాలీవుడ్ లోనే కాదు ఇండియా వ్యాప్తంగా అతనికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. గతేడాది అతడు నటించిన రెండు సినిమాలు రూ.1000 కోట్లకుపైగా వసూలు చేశాయంటే అతనికి ఉన్న క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు.
అయితే తాజాగా మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్స్ ఇన్ ద వరల్డ్ జాబితాలోనూ షారుక్ చోటు దక్కించుకోవడం అతని అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డిసిల్వా ఓ శాస్త్రీయ అధ్యయనం ద్వారా అత్యంత అందగాళ్లయిన నటుల జాబితాను తయారు చేశాడు. ఇందులో షారుక్ ఖాన్ 86.76 శాతం స్కోరుతో పదో స్థానంలో నిలిచాడు.
ప్రపంచ అందగాడు అతడే..
గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ప్రకారం ఈ అధ్యయనంలో నటుల ముఖాల అందాన్ని అంచనా వేశారు. ఈ గోల్డెన్ రేషియోకు ఎంత మంది నటుల ముఖాలు దగ్గరగా ఉన్నాయో తన దగ్గర ఉన్న ఫేస్ మ్యాపింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా డాక్టర్ జూలియన్ డిసిల్వా ఓ అంచనాకు వచ్చారు.
ఇలా ఈ జాబితాలో తొలి స్థానంలో ఆరోన్ టేలర్ జాన్సన్ నిలిచాడు. ఇతడు ఇంగ్లండ్ కు చెందిన నటుడు. 1996 నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇక అతని తర్వాత రెండో స్థానంలోనూ బ్రిటీష్ యాక్టరే అయిన లూసియెన్ లావిస్కౌంట్ నిలవగా.. మూడో స్థానంలో ఐరిష్ యాక్టర్ పాల్ మెస్కల్ ఉన్నాడు.
ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రాబర్ట్ ప్యాటిన్సన్, జాక్ లౌడెన్, జార్జ్ క్లూనీ, నికొలస్ హౌల్ట్, చార్లెస్ మెల్టన్, ఇడ్రిస్ ఎల్బా ఉన్నారు. పదో స్థానంలో షారుక్ ఖాన్ తో ఈ టాప్ 10 మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్స్ లిస్ట్ పూర్తవుతుంది.