ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ రూ.36 వేల కోట్లు.. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.850 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిరీస్ ఇదే-most expensive web series in the world harry potter series to cost 420 crores dollars ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ రూ.36 వేల కోట్లు.. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.850 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిరీస్ ఇదే

ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ రూ.36 వేల కోట్లు.. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.850 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిరీస్ ఇదే

Hari Prasad S HT Telugu

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యధిక బడ్జెట్ కలిగిన వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ ను ఏకంగా రూ.36 వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ కు రూ.850 వరకూ ఖర్చు పెడుతున్నారంటే నమ్మగలరా?

హ్యారీ పోటర్ వెబ్ సిరీస్ కోసం నిర్మిస్తున్న నగరం

మన సినిమాల బడ్జెట్‌లు ఇప్పుడిప్పుడే వందల కోట్లు దాటుతున్నాయి. హాలీవుడ్ లో అయితే వేల కోట్లకు ఎప్పుడో చేరాయి. అది కూడా ప్రపంచంలో అత్యంత భారీ బడ్జెట్ మూవీ స్టార్ వార్స్ ది లాస్ట్ జేడి. ఈ సినిమాను సుమారు రూ.3800 కోట్ల బడ్జెట్ తో తీశారు. కానీ దీనికి సుమారు పది రెట్లు ఎక్కువగా ఉండే బడ్జెట్ తో ఓ వెబ్ సిరీస్ రానుందంటే నమ్మగలరా?

ప్రపంచంలోనే అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్

ప్రపంచంలోనే అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇప్పుడు రూపొందుతోంది. ఈ సిరీస్ బడ్జెట్ ఏకంగా 420 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.36 వేల కోట్లు కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన హ్యారీ పోటర్ బుక్స్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. మొత్తంగా ఏడు సీజన్లు, ఒక్కో సీజన్లో ఆరు ఎపిసోడ్లు ఉండేలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. అసలు ఒక్కో ఎపిసోడ్ కే 10 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.850 కోట్లు ఖర్చు చేస్తుండటం విశేషం.

జేకే రౌలింగ్ రాసిన ఒక్కో పుస్తకం ఆధారంగా ఒక్కో సీజన్ తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది తొలి సీజన్ వచ్చే అవకాశం ఉంది. ఇంత భారీ బడ్జెట్ తో ఇప్పుడీ సిరీస్ అత్యంత ఖరీదైన టీవీ షోగా నిలవనుంది. ఇప్పటి వరకూ ఈ రికార్డు ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ పేరిట ఉంది. ఆ సిరీస్ ను సుమారు రూ.8500 కోట్లతో తెరకెక్కించారు. ఒక్కో ఎపిసోడ్ కు రూ.530 కోట్లు ఖర్చు చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

సెట్స్ కోసమే 130 కోట్ల డాలర్లు

ఈ హ్యారీ పోటర్ సిరీస్ కోసం మొత్తంగా ఓ నగరాన్నే నిర్మించబోతున్నారు. ఇదో మినీ సిటీ. దీనిని నిర్మించడానికే ఏకంగా 130 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తుండటం విశేషం. హ్యారీ పోటర్ పుస్తకాల్లో ఉండే అన్ని ప్రముఖ లొకేషన్లను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే హ్యారీ పోటర్ పుస్తకాలపై 8 సినిమాలు తెరకెక్కాయి. అయితే ఈ సిరీస్ మాత్రం మరింత లోతుగా వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెబుతున్నారు. జేకే రౌలింగ్ మొత్తంగా ఏడు పుస్తకాలు రాసింది. అలా ఒక్కో పుస్తకాన్ని ఒక్కో సీజన్ గా తీసుకురాబోతున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం